జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ
నేడు బాధ్యతలు స్వీకరించనున్న సుజిత్ మల్లిక్
లక్ష్మీపురం: ఉద్యోగుల సమష్టి సహకారంతోనే రెవెన్యూ పరంగా సెంట్రల్ జీఎస్టీ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టగలిగానని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కమిషనర్‌గా సుజిత్ మల్లిక్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కన్నవారితోటలోని జీఎస్టీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నరసింహారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో గుంటూరు కమిషనరేట్‌తో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని తెలిపారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె.యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అనంతరం ఉద్యోగులు కమిషనర్‌ను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బి. రవికుమార్, సూపరింటెండెంట్లు గాదె శ్రీనివాసరెడ్డి, కె.యుగంధర్, నవీన్ రాజు, చీదెళ్ల ఈశ్వరరావు, చిట్టే వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, పూర్ణ సాయి పాల్గొన్నారు.
లేబర్ కోర్టు ఏజీపీగా ఫారూఖ్
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని లేబర్ కోర్టుకు ఏజీపీగా షేక్ ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


