అర్జీల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలి
డీఆర్వో షేక్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అధికారులు సమన్వయం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలు కూడా అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానిక సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన 290 అర్జీలను ఆయనతో పాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డీపీఓ సాయి కుమార్, జిల్లా అధికారులు పరిశీలించారు.


