కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి

Apr 27 2025 2:00 AM | Updated on Apr 27 2025 2:00 AM

కంపోస

కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి

తెనాలి టౌన్‌: స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్‌ కంపోస్టు యార్డు నిర్వహణపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కంపోస్టు యార్డును ఆయన అధికారులతో కలసి పరిశీలించారు. ముందుగా యార్డులోని వ్యర్థాలను తొలగించే ప్రక్రియను పరిశీలించి పనులు నత్తనడకన సాగడాన్ని గుర్తించి సదరు కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. నెలాఖారులోగా డంపింగ్‌ యార్డులోని చెత్త మొత్తం తరలించాలని ఆదేశించారు. అనంతరం కొబ్బరిబొండాల నుంచి పీచు తయారీ యంత్రం వద్దకు వెళ్ళారు. గత ఆరు నెలలుగా యంత్ర సేవలు నిరుపయోగంగా ఉన్నాయని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని రోడ్ల వెంట ఇష్టారాజ్యంగా కొబ్బరి బొండాలు పడి ఉండటాన్ని తాను చూశానని, మీరంతా ఏమి చేస్తున్నారు అని కమిషనర్‌, హెల్త్‌ ఆఫీసర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని అధికారులను హెచ్చరించారు. డంపింగ్‌యార్డు నుంచి వస్తున్న కలుషిత నీరు పక్క పొలాల్లోకి వెవెళ్లడాన్ని గుర్తించి సత్వరం మూడు అడుగుల మేర చుట్టూరా గుంట తీసి వ్యర్థపు నీరు రైతుల పొలాల్లోకి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అధికారులనుఆదేశించారు.

కుక్కల బెడద రూపుమాపాలి..

వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సందర్శించారు. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు శూన్యమని హెల్త్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. ప్రతి రోజు తెనాలి జిల్లా వైద్యశాలకు కుక్క కరిచిందని బాధితులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలసత్వం వీడి కుక్కల బెడద రూపుమాపాలని సూచించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో సరైన రీతిలో చెత్త సేకరణ జరగడం లేదని తెలిపారు. రూ.3.20 కోట్ల నిధులతో డంపింగ్‌యార్డులోని వ్యర్థాలను తొలగిస్తున్నట్లు తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ తాడిబోయిన రాధిక, కమిషనర్‌ బండి శేషన్న, హెల్త్‌ ఆఫీసర్‌ హెలెన్‌ నిర్మల, రెవెన్యూ ఆఫీసర్‌ రాంప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

రైతుల ఆవేదన

అధికారులపై మండిపాటు

కుక్కల నియంత్రణ ఎక్కడ

చేస్తున్నారని ప్రశ్న

కొబ్బరి పీచు తయారీ యంత్రం

నిరుపయోగంగా ఉండడంపై మండిపాటు

కంపోస్టు యార్డు చుట్టూరా దాదాపు15 ఎకరాల మేర పంటలు పండక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యార్డు నుంచి వచ్చే వ్యర్థపు నీరు పంట పొలాల్లోకి చేరడం వల్ల పైరు నాటిన కొద్ది రోజులకే పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా మొర అలకించడం లేదని గడ్డిపాటి ఉదయశంకర్‌ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు యార్డు తూర్పు భాగాన 4.50 ఎకరాల పొలం ఉందని, పొలంలో పంట పండించి దానిపై ఆదాయం చూసి సంవత్సరాలు గడిచిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇప్పుడైనా మంత్రి చెప్పిన విధంగా కంపోస్టు యార్డును ఇక్కడి నుంచి తరలిస్తే రాబోయే రోజుల్లోనైనా పంటలు పండించి దానిపై ఆదాయం చూడాలన్నా ఆశ ఉందని తెలిపారు.

కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి 1
1/1

కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement