బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం | - | Sakshi
Sakshi News home page

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం

Sep 24 2025 5:35 AM | Updated on Sep 24 2025 5:35 AM

బాలాత

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం ఏఎన్‌యూలో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల ఆధ్వర్యంలో స్మార్ట్‌ ఇండియా అంతర్గత హ్యాకథాన్‌ 2025ను మంగళవారం నిర్వహించారు. యువత తమలోని ప్రతిభ, పారిశ్రామిక ఆలోచనలను ప్రదర్శించేందుకు ఉత్సాహపూరితమైన వేదికను ఈ హ్యాకథాన్‌ అందించింది. సృజనాత్మక ఆలోచనలు పెంచేలా కార్యక్రమం నిలిచింది. విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. నిరుపయోగంగా స్వాగత హోర్డింగులు తాడేపల్లి రూరల్‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో జరిగే దేవి నవరాత్రుల కోసం వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం పలుచోట్ల దేవదాయ శాఖ అధికారులు హోర్డింగులు ఏర్పాటు చేస్తారు. ఇలా తయారు చేయించిన హోర్డింగులు మంగళవారం కూడా సీతానగరం సీతాభవనంలోనే గోడలకు ఆనించి దర్శనమిచ్చాయి. ఏటా వేడుకలకు ముందుగానే వీటిని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఏర్పాటు చేసేవారు. ఈ సారి మాత్రం నవరాత్రులు ప్రారంభమై రెండు రోజులు అవుతున్నా ఇక్కడే ఉండడంతో ఆ శాఖ నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో బాల చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ బాల త్రిపురసుందరి దేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసుర మర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో రెండో రోజు అమ్మవారికి వారాహిదేవి అలంకారం చేసి, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు.

తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం సమీపంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ , విద్యాశాఖ కమిషనర్‌ విజయ రామరాజు, జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌లు పరిశీలించారు. ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్‌ ఆఫీజ్‌, సంయుక్త కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవలు వారి వెంట ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

బాలాత్రిపుర సుందరీదేవిగా   బాల చాముండేశ్వరి దేవి దర్శనం1
1/2

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం

బాలాత్రిపుర సుందరీదేవిగా   బాల చాముండేశ్వరి దేవి దర్శనం2
2/2

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement