
పార్టీ శ్రేణులకు భరోసా.. డిజిటల్ బుక్
అన్యాయానికి న్యాయబద్ధమైన
ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం..
డిజిటల్ బుక్ స్కానర్ల ఆవిష్కరణలో
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ స్కానర్‌ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితోపాటు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా, నగర కమిటీ నేతలు హాజరయ్యారు.
తగిన సమాధానం చెబుతాం
ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి ప్రజలు, కార్యకర్తలు రెండు కళ్లులాంటి వారని, అందర్ని కాపాడుకునేందుకు డిజిటల్ బుక్‌ను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారన్నారు. పార్టీ కార్యకర్తకు జరిగిన అన్యాయానికి న్యాయబద్ధమైన సమాధానం రాబోయే జగన్ 2.0 లో ఇవ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను త్రీవంగా ఖండించారు. గతంలో చిరంజీవి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి ఎంతో హుందాగా వ్యవహరించారని, దానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నవ్వడం సిగ్గు చేటన్నారు. ముందు డిజిటల్ బుక్‌లో బాలకృష్ణ పేరు నమోదు చేయాలన్నారు.
శ్రేణులకు అండగా పార్టీ
పార్టీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలబడేందుకు డిజిటల్ బుక్ ప్రారంభించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామన్నారు.
అక్రమ కేసులతో వేధింపులు
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పారు. వ్యాపారాలను దెబ్బతీశారని ఆరోపించారు. తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని తెలిపారు. కచ్చితంగా వారం రోజులపాటు డిజిటల్ బుక్‌లో, పూర్తి స్థాయిలో అక్రమ కేసుల గురించి స్పష్టంగా వివరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నిమ్మకాయల రాజానారాయణ, షేక్ మస్తాన్‌వలి, షేక్ గులాం రసూల్, నందేటి రాజేష్, తాడిబోయిన వేణుగోపాల్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వేలూరి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాధానం ఖాయం
వైఎస్సార్‌సీపీ నేతల పునరుద్ఘాటన