
ఆట్యాపాట్యా రాష్ట్ర క్రీడల్లో జిల్లాకు తృతీయ స్థానం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆట్యాపాట్యా క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయని గుంటూరు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ కార్యదర్శి దావులూరి సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్ షిప్–2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఈ విజయాలు నమోదు చేసారన్నారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈవో రంభ ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల విజయ్‌కుమార్ తదితరులు అభినందించారన్నారు.

ఆట్యాపాట్యా రాష్ట్ర క్రీడల్లో జిల్లాకు తృతీయ స్థానం