సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు | - | Sakshi
Sakshi News home page

సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు

Sep 29 2025 8:32 AM | Updated on Sep 29 2025 8:32 AM

సావిత

సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు

సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి మెప్పించారని ప్రముఖ నటి జయసుధ అన్నారు. కళాదర్బార్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుంటూరులోని నాజ్‌ సెంటర్‌లో ఉన్న మహానటి సావిత్రి కాంస్య విగ్రహానికి జయసుధ ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రి నటనను, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాదర్బార్‌ అధ్యక్షులు పొత్తూరి రంగారావు, సభ్యులు బి.చంద్రబాబు, భానుప్రకాష్‌, వెంకటరత్నం, శివకుమార్‌, హనుమాన్‌సింగ్‌, కృష్ణారావు, ధర్మసింగ్‌, సత్యవాణి, రజని పాల్గొన్నారు. కనకదుర్గమ్మ సేవలో పల్నాడు జిల్లా జడ్జి సత్యశ్రీ సాగర్‌ వద్ద పర్యాటకుల సందడి ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఊరేగింపు

రెంటచింతల: పల్నాడు ప్రాంతంలో త్రిశక్తి పీఠం (లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి)గా విరాజిల్లుతున్న పాలువాయి జంక్షన్‌లోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జిల్లా జడ్జి సత్యశ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందచేశారు. తొలుత జిల్లా జడ్జికి ఆలయ ప్రధాన ధర్మకర్త ఏచూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ చుండు సాంబశివశాస్త్రి ఘనంగా స్వాగతం పలికారు. రెంటచింతల వెంకటేశ్వరస్వామి దేవస్థానం అధ్యక్షులు నాళం పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: దసరా సెలవులు కావటంతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్‌ డ్యాం 26 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు సాగర్‌కు చేరుకొని డ్యాం గేట్లు తిలకించిన అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి దేవాలయాలను సందర్శిస్తున్నారు. నూతన బ్రిడ్జి, పాత వంతెన, లాంచీస్టేషన్‌, కృష్ణవేణి పుష్కర్‌ఘాట్‌ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతాన్నీ వీక్షించారు.

లాంచీస్టేషన్‌ ఆదాయం రూ.1,30,100

పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. దీంతో లాంచీస్టేషన్‌కు రూ.1,30,100 ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్‌ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.

పిడుగురాళ్ల: సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో గల నాగుల గుడి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆశ్వయూజ శుద్ధ పష్టి సందర్భంగా కావడి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాగుల గుడి దేవాలయం నుంచి గంగమ్మ గుడి వరకు కావడి ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సావిత్రి నటనను  ఎవరూ భర్తీ చేయలేరు 1
1/2

సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు

సావిత్రి నటనను  ఎవరూ భర్తీ చేయలేరు 2
2/2

సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement