
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
కాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన ముగ్గు రు పవర్‌లిఫ్టర్లు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ బెంచిప్రెస్ ఛాంపియన్‌షిప్–25 పోటీలో గోల్డ్‌మెడల్స్ సాధించారు. కాజీపేట కడిపికొండ రాంనగర్‌కు చెందిన ఎండి.జాఫర్ 59 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కాజీపేట సోమిడికి చెందిన దామెరుప్పుల మొగిళి 54 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కడిపికొండ రాంనగర్‌కు చెందిన కుక్కల ఉమాసాయి 105 కిలోల కేటగిరీలో ఐదో స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరిలో పవర్ లిఫ్టర్ జాఫర్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. మే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొననున్నట్లు జాఫర్ తెలిపారు. కాగా.. ఈ ముగ్గురిని మంగళవారం కాజీపేట ఆర్‌పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఆర్‌పీఎఫ్ సీఐ,నేషనల్ ప్లేయర్ ఎం. సంజీవరావు సత్కరించారు.
పీజీ కోర్సుల మొదటి
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: ఈనెల 20 నుంచి పీజీ కోర్సు ల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బీఎస్‌ఎల్ సౌజన్య తెలిపా రు. కేయూలోని పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సుల (రెగ్యులర్,ఎక్స్,ఇంప్రూవ్‌మెంట్) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నిట్ నూతన రిజిస్ట్రార్‌గా
సుశీల్‌కుమార్ మెహతా
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ నూత న రిజిస్ట్రార్‌గా సుశీల్‌కుమార్ మెహతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్వీ.ఉమామహేశ్ నుంచి సుశీల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని మార్యదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నూతన రిజిస్ట్రార్‌ను ఆయన అభినందించారు.
7 నుంచి వరంగల్ జిల్లాస్థాయి
యువజన క్రీడోత్సవాలు
వరంగల్: ఓసిటీ క్రీడా మైదానంలో ఈనెల 7, 8 తేదీల్లో వరంగల్ జిల్లాస్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం వరంగల్ జిల్లా అధికారి చింతల అన్వేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలుకా స్థాయిలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన క్రీడాపోటీల విజేతలు క్రీడల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. 15 నుంచి 20 ఏళ్లలోపు వారికి వాలీబాల్, రన్నింగ్, షటిల్ సింగిల్స్, యువతులకు కబడ్డీ, షటిల్ సింగిల్స్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 99080 69469/95024 49469 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment