
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయోగ్యాస్ ప్లాంట్‌ను మంగళవారం మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాలనీల్లో తిరుగుతున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడి చెత్తతో తయారైన కంపోస్టు ఎరువును ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించాలని సూచించారు. కార్పొరేషన్‌లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ నుంచి వచ్చే విద్యుత్‌ను ప్రతిరోజూ 2 గంటలపాటు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిచెత్తను నగరంలోని డీఆర్‌సీసీ కేంద్రాలకు, అక్కడ నుంచి దేశంలోని వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర ప్రజలు ముందుండాలని మేయర్ గుండు సుధారాణి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment