●
● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు హసన్‌పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి.
● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హనుమకొండ, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్‌తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది.
● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేషన్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తున్న బియ్యంపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ సమయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది.
● ఈ దందాలో రూ. లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్‌లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్‌లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది.
● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తనిఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు కూడా ప్రకటించారు.
వరంగల్
Comments
Please login to add a commentAdd a comment