
ఫిర్యాదుల పెట్టెలతో సమస్యల పరిష్కారం
వరంగల్ కలెక్టర్
సత్యశారద
వరంగల్: జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాల్లోని డార్మెటరీల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతున్నాయని వరంగల్ కలెక్టర్ సత్యశారద.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొని మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం పోషకాహారం, మౌలిక వసతులు కల్పిస్తున్నారని, గురుకులాల సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. దీంతో సీఎస్ శాంతికుమారి అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment