
ఎక్కువ పనిదినాలు కల్పిస్తాం
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
● ఘనంగా ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం
హసన్‌పర్తి: ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పిస్తామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హసన్‌పర్తిలోని సంస్కృతీ విహార్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనిటీ పరంగా ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. ఉపాధి పనులు కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం తక్కువ సమయంలో పూర్తి చేయడాన్ని అభినందించారు. ఈసందర్భంగా తమకు మూడు నెలల నుంచి వేతనాలు అందట్లేదని, వెంటనే విడుదల చేయించాలని సిబ్బంది కలెక్టర్‌ను కోరారు. విశిష్ట సేవలు అందించిన హసన్‌పర్తి ఎంపీడీఓ కర్ణాకర్‌రెడ్డిని కలెక్టర్ సత్కరించి సర్టిఫికెట్ అందించారు.డీఆర్డీఓ మేన శ్రీను అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ విజయలక్ష్మి, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment