
దళిత బంధు నిధులు విడుదల చేయాలి
హన్మకొండ: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలలోపు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, రా ష్ట్ర కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వా రు మాట్లాడారు. రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై న వారికి కేటాయించిన నిధులు జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయని, ఈ ని ధులు వెంటనే విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయ కులు దర్శనాల సంజీవ, డివిటి బాలనర్సు, కొలు గూరి సురేశ్, ఊట్ల శ్రీనివాస్, పులి రామయ్య, రమే శ్, ఎనగందుల మొగిలి, ఆకాశ్, భిక్షపతి, శంకర్, సైదులు, లక్ష్మయ్య, రాజు, సుమన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment