![గడ్డి విత్తనాల ఉత్పత్తిపై అవగాహన](/styles/webp/s3/article_images/2025/02/5/04ety005-330099_mr-1738697024-0.jpg.webp?itok=CSmgGxug)
గడ్డి విత్తనాల ఉత్పత్తిపై అవగాహన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు డెయిరీ ప్రాంగణంలో గడ్డి విత్తనాల ఉత్పత్తిపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో న్యూఢిల్లీ వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ జట్, డాక్టర్ భూపేంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గడ్డి విత్తనాల పెంపకం, ఉత్పత్తి, క్షేత్రప్రదేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన గడ్డి ఉత్పత్తిలో అధిక పోషకాలు లభిస్తాయన్నారు. దీని ద్వారా గేదెల్లో పాల ఉత్పత్తి అధికంగా పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో డెయిరీ జనరల్ మేనేజర్ మారుపాటి భాస్కర్‌రెడ్డి, సునీల్‌కుమార్, కీర్తి, వినోద్, దీప, తదితర రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment