మార్కెట్‌లో మౌలిక వసతులేవి? | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

Published Wed, Feb 5 2025 12:55 AM | Last Updated on Wed, Feb 5 2025 12:55 AM

మార్క

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

వరంగల్‌ : వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌.. ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఇక్కడికి రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ పంట సరుకుల విక్రయానికి వస్తారు. తమ పంట ఉత్పత్తుల విక్రయాలకు రైతులు.. కొనుగోలు చేసేందుకు వందలాది మంది వ్యాపారులు.. కాంటాలు వేసేందుకు దడవాయిలు, హమాలీలు, కార్మికులు.. ఇలా మొత్తం సుమారు రెండు వేల నుంచి ఐదు వేల మంది వరకు నిత్యం మార్కెట్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కెట్‌లో మౌలిక వసతులు లేవంటూ మంగళవారం అడ్తి వ్యాపారులు, ఖరీదుదారులు మార్కెట్‌ కమిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాతో కాంటాలు నిలిచిపోయాయి. దీంతో మిర్చి కొనుగోళ్లు నిలిచాయి. సోమవారం అడ్తివ్యాపారి కడారి సదానందం మార్కెట్‌లోని ఓ హోటల్‌ వద్ద టీ తాగుతూ గుండెపోటుతో మృతి చెందాడు. అతడి మృతికి సంతాపం వ్యక్తం చేసిన అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ యార్డులలో క్లీనింగ్‌ లేకపోవడం, రవాణా వాహనాలు, మిర్చి ఘాటుతో గుమస్తాలు, దడువాయిలు, రైతులు, హమాలీ కార్మికులు, వ్యాపారులు అనారోగ్యంతో చనిపోతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు చికిత్స చేయడానికి 24 గంటలు మార్కెట్‌లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. అలాగే, మార్కెట్‌లో వైఫై లేక పీఓఎస్‌ యంత్రాలు సరిగా పనిచేయడంలేదన్నా రు. ఫలితంగా కాంటాలు ఆలస్యం కావడం, చోరీ లు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అఽధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు లిఖితపూర్వకంగా విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న మార్కెట్‌ కార్యదర్శి పి.నిర్మల ఘటనాస్థలికి చేరుకుని మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన అనంతరం మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం కాంటాలు జరగడంతో యథావిధిగా మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. కార్యక్రమంలో చాంబర్‌ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాశ్‌, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్‌, కోశాధికారి అల్లే సంపత్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

వసతుల కల్పనపై జేడీఎం సమీక్ష..

మార్కెట్‌లో మౌలిక వసతులపై వ్యాపారులు ధర్నా నిర్వహించడంతో మార్కెట్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌, జేడీఎం శ్రీనివాస్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల అనుమతితో మార్కెట్‌లో వసతులు కల్పిస్తామని చాంబర్‌కు లేఖ రాసినట్లు తెలిపా రు. సమీక్షలో మార్కెట్‌ కార్యదర్శి పి.నిర్మల, ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, గ్రేడ్‌ 2 కార్యదర్శులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

సౌకర్యాలు కల్పించాలి

మార్కెట్‌లో ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాం. విశ్రాంతి భవనంలో వసతులు సమకూర్చాలి. మూత్రశాలలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే, మార్కెట్‌లోని మెడికల్‌ సెంటర్‌లో వైద్య సౌకర్యాలు కల్పించాలి.

–పసునూటి మల్లయ్య, రైతు, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్‌

తాగునీటి సౌకర్యం మెరుగుపర్చాలి

మార్కెట్‌లో యార్డు చుట్టూ నల్లాలు ఉన్నా నీళ్లు సరిగా రావడం లేదు. లోపలకు వెళ్తే ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాగునీటి సౌకర్యం మెరుగుపర్చాలి. కార్మికులు అస్వస్థతకు గురైతే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలి. అంబులెన్స్‌ ఉంటే వ్యాపారి బతికేవాడు.

–అప్సర్‌ హమాలీ కార్మికుడు

మార్కెట్‌లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి

నిత్యం వేలాది మంది రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉండే మార్కెట్‌లో వైద్య సేవలు అందించేందుకు పీహెచ్‌సీ(బస్తీ దవాఖాన)ఏర్పాటు చేయాలి. గుండెపోటుకు గురైన వ్యాపారిని సకాలంలో 108లో ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడు.

–డి.కరుణాకర్‌,

గుమస్తాల సంఘం నాయకుడు

వైఫై, పీఓఎస్‌ మిషన్లు లేక ఇబ్బందులు

మొక్కుబడిగా వైద్యసేవలు

వసతులు కల్పించాలని అడ్తి వ్యాపారులు, ఖరీదుదారుల ధర్నా

రెండు గంటల పాటు నిలిచిన

కాంటాలు, క్రయ,విక్రయాలు

అధికారుల హామీతో ధర్నా విరమణ.. కొనసాగిన మిర్చి కొనుగోళ్లు

పీఓఎస్‌ మిషన్లు సమకూర్చాలి

మార్కెట్‌లో 120 మంది దడవాయిలం ఉన్నాం. ప్రస్తుతం 40 పీఓఎస్‌ మిషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 80 మిషన్లు వస్తున్నాయని రెండేళ్లుగా అంటున్నారే తప్పా రావడం లేదు. కార్యదర్శి 10 మిషన్లు వచ్చాయని చెప్పారు. వాటిలో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.

–సోలరవి, దడవాయి యూనియన్‌ సెక్రటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
మార్కెట్‌లో మౌలిక వసతులేవి? 1
1/5

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

మార్కెట్‌లో మౌలిక వసతులేవి? 2
2/5

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

మార్కెట్‌లో మౌలిక వసతులేవి? 3
3/5

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

మార్కెట్‌లో మౌలిక వసతులేవి? 4
4/5

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

మార్కెట్‌లో మౌలిక వసతులేవి? 5
5/5

మార్కెట్‌లో మౌలిక వసతులేవి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement