
మినీ జాతరకు వేళాయె..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర(మండమెలిగె పండుగ)కు వేళయింది. నేటి( బుధవారం) నుంచి పూజ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమ్మక్క పూజారులు ఉదయం సమ్మక్క గుడికి చేరుకుని అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. గుడిని శుద్ధి చేసిన తర్వాత సిద్ధబోయిన ముణిందర్ ఇంటి నుంచి పూజారులు, ఆడపడుచులు డోలివాయిద్యాలతో పసుపు, కుంకుమ తీసుకుని సమ్మక్క గుడికి వెళ్తారు. గుడిలో అప్పటికే పూజారి కొక్కెర కృష్ణయ్య అలికి సిద్ధంగా ఉంచిన అమ్మవారి శక్తిపీఠంపై ఆడపడుచులు ముగ్గులు వేసి అలంకరిస్తారు. అనంతరం అడవి నుంచి తీసుకొచ్చిన ఎట్టిగడ్డిని సమ్మక్క గుడి భవనం ఈశాన్యం మూలన పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో..
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని సారలమ్మ పూజారులు, ఆడపడుచులు కలిసి శుద్ధి చేస్తారు. అమ్మవారి గుడిలో, ఆవరణలో ముగ్గులు వేస్తారు. సారలమ్మ వస్త్రాలు, పూజ సామగ్రిని ప్రధాన పూజారి సారయ్య శుద్ధి చేస్తారు. సారలమ్మ వడ్డె కుండలను పసుపు, కుంకుమతో ఆడపడుచులు అలంకరిస్తారు. అనంతరం గుడిలో పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. మండమెలిగె పండుగకు వారానికి ముందు గుడిమెలిగె పండుగను నిర్వహిస్తారు. ఈనెల 12వ తేదీన (బుధవారం) మేడారం, కన్నెపల్లిలో మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగతో పూజ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.
జాతరకు ఏర్పాట్లు సిద్ధం..
మినీ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారురులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జాతరలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క.. అధికారులను ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. దీంతో కలెక్టర్ దివాకరటీఎస్ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. జాతర సమీపిస్తుడడంతో అధికారులు మిగిలిన పనులన్నీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఎస్పీ శబరీశ్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
నేడు మేడారం, కన్నెపల్లిలోని
ఆలయాల్లో గుడి మెలిగె పండుగ
వనదేవతల జాతరకు ఏర్పాట్లు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment