![జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు](/styles/webp/s3/article_images/2025/02/5/04hmkd53-330086_mr-1738697027-0.jpg.webp?itok=a-gJLoqS)
జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి
మేడారం మినీ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి హనుమకొండ నుంచి రోజూ 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు నడుపుతాం. భక్తులను క్షేమంగా చేరవేయడమే లక్ష్యం. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రమాదాలకు గురి కావొద్దు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలి. వివరాలకు ఆర్టీసీ హనుమకొండ బస్ స్టేషన్ ఎంక్వైరీ 9959226056 నంబర్‌లో సంప్రదించాలి.
– డి.విజయ భాను, ఆర్టీసీ ఆర్‌ఎం, వరంగల్
హన్మకొండ/ఎస్‌ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరగనున్న మినీ జాతరకు టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు అధికారులు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బస్సులు నడపనున్నారు. ఎనిమిది రోజులు.. 200 బస్సులు.. 400 ట్రిప్పులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు పంపేందుకు సమాయత్తమయ్యారు. ఈ నెల 9 నుంచి ఉదయం 6 గంటల నుంచి హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి మేడారానికి బస్సులు నడపనున్నారు. 9న 15 బస్సులు, 10న 10, 11న 10, 12న 20, 13న 25, 14న 50, 15న 20, 16న 50 బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమలు చేయనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హనుమకొండ, మేడారం బస్ స్టేషన్లలో రోజూ డిపో మేనేజర్‌తో పాటు ఇద్దరు కంట్రోలర్లు ప్రత్యేక బస్సుల ఆపరేషన్ పర్యవేక్షిస్తారు.
ఎనిమిది రోజులు.. 200 బస్సులు.. 400 ట్రిప్పులు
ఈ నెల 9 నుంచి 16 వరకు..
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
Comments
Please login to add a commentAdd a comment