![ప్రేమపేరుతో బాలికపై లైంగికదాడి](/styles/webp/s3/article_images/2025/02/5/0000633825-000001-reddychickenc_mr-1738697027-0.jpg.webp?itok=6kcwfHEo)
ప్రేమపేరుతో బాలికపై లైంగికదాడి
ఖిలా వరంగల్: బాలికను ప్రేమపేరుతో ఓ యువకుడు లైంగికంగా లోబర్చుకున్నాడు. చివరికి ఆమె గర్భవతి కావడంతో విషయం వె లుగులోకి వచ్చింది. ఈ ఘటన మంగళవారం వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన బాలిక (16) ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్ (20), బాలిక మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త రెండేళ్లుగా ప్రేమగా మారింది. కొద్ది నెలలుగా ప్రేమ, పెళ్లి పేరుతో ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్ప డ్డాడు. దీంతో బాలికకు అనారోగ్య సమస్యలు తల్తెత్తడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా గర్భవతి అని తేలింది. ఈవిషయంపై తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో విషయం చెప్పింది. మంగళవారం మిల్స్‌కాలనీ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించగా గర్భవతని తెలిసింది. ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికదాడికి పాల్పడి బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు.
పోలీసుల అదుపులో యువకుడు..
ప్రేమ,పెళ్లి పేరుతో బాలికకు లైంగికంగా దగ్గరై గర్భవతిని చేసిన యువకుడిని మంగళవారం సాయంత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
● గర్భం దాల్చడంతో
విషయం వెలుగులోకి..
● తల్లిదండ్రుల ఫిర్యాదుతో
నిందితుడిపై పోక్సో కేసు
Comments
Please login to add a commentAdd a comment