
పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
● కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. అకడమిక్ పరంగా ముందుకెళ్లాలని కాకతీయ యూ నివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి సూచించారు. కేయూ సెనెట్‌హాల్‌లో మంగళవారం అన్నివిభాగాలు, యూనివర్సిటీ కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల, ప్రొఫెసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఎఫ్‌సీ కోర్సులను రెగ్యులర్‌గా మార్చేలా ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. కే హబ్‌లోని పరిశోధన కేంద్రాలకు రూ.15 కోట్లు మంజూరైన నేపథ్యంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నా రు. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.31 కోట్ల బడ్జెట్ ఉత్తర్వులు వచ్చాయన్నారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు పీఆర్‌సీ ఏరియర్స్‌ను మార్చి వరకు బకాయిలు లేకుండా చెల్లిస్తామన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడారు.
లెర్నింగ్ నిరంతర ప్రక్రియ..
లెర్నింగ్ నిరంతర ప్రక్రియ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. రెండు వారాలుగా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్సెల్ టూ పవర్ బీఐఫర్ ఎన్‌సీసీ జవాన్ల శిక్షణ కార్యక్రమం మంగళవారం కంప్యూటర్ సైన్స్ విభాగంలో ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శిక్షణ పొందిన జవాన్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ రామచంద్రం, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ మంజుల, డాక్టర్ రమేశ్, నీలిమ, సలోని ఫాతిమా, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పృథ్వీరాజ్, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ రవిసునారే, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment