సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం సులువు
● మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల
వరంగల్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ డం వల్ల వ్యవసాయంలో సులువుగా పనులు చే యొచ్చని వరంగల్ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల అన్నారు. మార్కెట్‌లోని మన అగ్రిటెక్‌లో మంగళవారం డ్రోన్ స్ప్రేయర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ.. సాంకేతిక పరిజ్ఞానంతో మానవ లోకం ఎంతో ముందడుగు వేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించిన ప్రముఖ దక్ష కంపెనీ రూపొందించిన డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేశ్ అందుబాటులోకి తేవ డం అభినందనీయమన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు డ్రోన్ వినియోగంపై రైతులకు అవగా హన కల్పించారు. మన అగ్రిటెక్ ఎండీ రమేశ్ మా ట్లాడుతూ.. డ్రోన్ 10 లీటర్ల నీటి సామర్థ్యంతో ఎకరా కేవలం 5–7నిమిషాల వ్యవధితో పిచికారీ చే స్తుందని, ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 3ఎకరాల వర కు పనిచేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకట్‌రావు, నూతనకల్ పీఏసీఎస్ చెర్మన్ జ యసుధ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment