విద్యారంగానికి తక్కువ నిధులు
● ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి
కేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటా యించారని, మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేదని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కళాశాలలోని ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు. వేతన జీవులకు సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఇన్‌చార్జ్ అధిపతి డాక్టర్ శ్రీధర్‌కుమార్‌లోథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌తో సామాన్యులు ఏమీ లాభంలేదని తెలిపారు. ఉద్యోగ రంగాలకు కేటాయింపులు లేవన్నారు. బీసీ జాక్ చైర్మన్ డాక్టర్ తిరునహరిశేషు మా ట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రమేశ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment