
బడుగు, బలహీన వర్గాలకు నవశకం
హన్మకొండ చౌరస్తా: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నవశకాన్ని ప్రారంభించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణనకు చట్టబద్ధత, ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయిని మాట్లాడుతూ ఫిబ్రవరి 4 రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని సువర్ణ దినమని, కాంగ్రెస్ తప్పితే ఇంకెవరు కూడా సామాజిక న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, ఆర్‌టీఏ సభ్యుడు పల్లకొండ సతీశ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరళ, నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment