గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆయా విభాగాలు వాస్తవ సమాచారం అందజేసి బడ్జెట్ రూపకల్పనకు సహకరించాలని, ఆదాయ వ్యయ అంచనాలతో రూపొందించాలని సూచించారు. అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు అన్ని విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున బడ్జెట్ సమావేశం నిర్వహణకు ఈసీ అనుమతికి లేఖ రాయాలని పేర్కొన్నారు. అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్నరాణి, రాజేశ్వర్, హెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి ఎంహెచ్‌ఓ రాజేశ్ పాల్గొన్నారు.
ఈసేవ కేంద్రం తనిఖీ
కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన పోచమ్మమైదాన్‌లోని ఈసేవ కేంద్రాన్ని గ్రేటర్ కమిషనర్ తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment