వరంగల్ లీగల్: న్యాయవాదుల పోరాటానికి ఫలి తంగా ఎట్టకేలకు హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతా రెడ్డిపై హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదు అ య్యింది. ఇటీవల కేయూ కూడలిలో న్యాయవాది శివపై చెయ్యి చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటనపై న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యా ప్తంగా పోరాటాలు చేస్తామని అన్ని జిల్లాల్లోని న్యా యవాద సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈవిషయాలతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చాలని ప్రయత్నాలు చేసినా న్యాయవాదులు అంగీకరించలేదు. దీంతో బుధవారం రాత్రి సీఐతో పాటు మరి కొంత మంది పోలీసులపై దాడి, బెదిరించిన నేరాల కింద కేసు నమోదు చేశారు. అయినా న్యా యవాదులు విధుల బహిష్కరించారు. సదరు సీఐ ని సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. వరంగల్, హ నుమకొండ జిల్లాల న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో సీఐని సస్పెండ్ చేయడంతో పాటు భవిష్యత్‌లో ఏ ఒక్క న్యాయవాదిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సంఘాల అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, బడే రమేశ్, ముదసిర్ అహ్మద్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment