విద్యారణ్యపురి: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్ష ద్వారా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, మరికొన్ని స్టేట్ యూనివర్సిటీల్లోనూ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చని నిట్ వరంగల్ ప్రొఫెసర్ కాశీనాఽథ్ తెలిపారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంఽధించి ప్రధానంగా సీయూఈటీ పరీక్ష విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేడీసీ కెమిస్ట్రీ విభాగం అధిపతి వాసం శ్రీనివాస్ మాట్లాడుతూ సీయూఈటీ, పీజీసెట్ కోసం కేడీసీలోని కెమిస్ట్రీ విభాగంలో త్వరలోనే 40 రోజులు ఉచిత కోచింగ్ ఇవ్వబో తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనాఽథ్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్యాంప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ విజయలక్ష్మి, ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌సంధ్యారాణి, డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రసూన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment