
కాంట్రాక్టు టీచర్లుగా ఉత్తర్వులు
జిల్లాలో 14 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌లు
విద్యారణ్యపురి: 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన బీఈడీ అభ్యర్థులకు శనివారం పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. హనుమకొండ జిల్లాకు 18 మందిని కేటాయించగా.. వారికి శుక్రవారం రాత్రి మెసేజ్‌ల రూపంలో సమాచారం ఇచ్చి మరుసటి రోజు కాంట్రాక్టు టీచర్లుగా నియమాక పత్రాలు అందజేసేందుకు కలెక్టర్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ వాసంతి పర్యవేక్షణలో పీజీ హెచ్‌ఎంలతో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. 18 మందికి గాను 14మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇద్దరు అభ్యర్థులు తాము అందుబాటులో లేమని ఈనెల 16న హాజరుకానున్నట్లు డీఈఓ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మరో ఇద్దరు ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో రెగ్యులర్ టీచర్లుగా ఉద్యోగంలో చేరారు. హాజరైన వారికి డీఎస్సీ ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించి.. వివిధ మండలాల్లోని ఖాళీలను చూపించగా ఎంపిక చేసుకున్నారు. వీరు ఏప్రిల్ 23వ తేదీ వరకు కాంట్రాక్టు టీచర్లుగా కొనసాగుతారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం నుంచి విధుల్లో చేరి విధులు నిర్వర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment