● 28 వరకు సమాచారమివ్వాలి
● గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ప్రజాపాలన కేంద్రాల్లో అందించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు నమోదు చేసుకోని ప్రజలు వివరాలివ్వాలని సూచించారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆసక్తి లేకపోవడం తదితర కారణాల వల్ల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన ఇంటింటి సర్వే హౌస్‌లిస్ట్‌లో ఉండి సర్వే చేయని కుటుంబాలకు ఫిబ్రవరి 16 నుంచి 28 ఫిబ్రవరి వరకు మరో అవకాశమివ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిందని అందుకోసం టోల్’ఫ్రీ నంబర్ 040–21111111 లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమాచారం అందించాలని కోరారు. ఆన్‌లైన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంతకం చేసి ప్రజాపాలన కేంద్రంలో అందించేందుకు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివారమైనా దరఖాస్తులు చేసుకోవచ్చు..
ఆదివారం సెలవురోజు అయినప్పటికీ జీడబ్ల్యూఎంసీ పరిధి ఈ–సేవా కేంద్రాల్లో సమగ్ర కుటుంబ సర్వే కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు. కాజీపేట సర్కిల్ పరిధిలో ఐదు ప్రజాపాలన సేవా కేంద్రాలైన కాజీపేట సర్కిల్ ఆఫీస్, సుబేదారి వాటర్ ట్యాంక్ ఆఫీస్, నక్కలగుట్ట వార్డు ఆఫీస్, అశోక థియేటర్ ఎదురుగా ఈసేవ కేంద్రం, నయీమ్‌నగర్ ఈసేవ కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment