వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీసీ నాయీబ్రాహ్మణ(ఎంబీసీ) సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కొలిపాక వెంకటస్వామికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్‌కుమార్ కోరారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ 19వ డివిజన్‌లో రాష్ట్ర కార్యదర్శి గోగికార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు బి.రామ్మోహన్, డి.శేఖర్, బేతి రాజు, బ్రహ్మచారి, రవి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎమ్మెల్సీగా గెలిపించాలని ప్రచారం’
హసన్‌పర్తి : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బలపరిచిన పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని బీజేపీ నాయకులు మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాంచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు తిరుపతి, చకిలం రాజేశ్వర్‌రావు, మట్టెడ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment