
శ్రీచైతన్యలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్
వరంగల్ : వరంగల్ ఎల్‌బినగర్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు అతిథులుగా హాజరు కాగా వారికి సన్మానం నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ బండారి కిరణ్ మాట్లాడుతూ..జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేయొద్దని అన్నారు. చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజేశ్వర్‌రెడ్డి, కోఆర్డినేటర్ తిరుమల్‌రెడ్డి, డీన్ వెంకటేశ్, జనార్దన్, శ్వేత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment