
ఆధునిక సాగుపై అవగాహన ఉండాలి
ఖిలా వరంగల్ : ఆధునిక వ్యవసాయ సాగు విధానంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న, శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు బుధవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎస్‌ఆర్ యూనివర్సిటీ విద్యార్థులు సందర్శించారు. ఈసందర్భంగా నూతన సాగువిధానం, పంటలను విద్యార్థులు పరిశీలించారు. అనంతరం చేపలు, నాటుకోళ్ల పెంపకం వల్ల వచ్చే లాభాలను వివరించారు. ఎస్‌ఆర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి కృష్ణారెడ్డి, శ్రీను, శ్రావ్య, పూజ, శ్రీవాత్సవ్, మానస, అమిత్, రవితేజ పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment