
పింఛన్.. ఇప్పించండి
కాజీపేట : కాజీపేటలోని డీజిల్‌కాలనీకి చెందిన కొరవి గణేష్‌కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో దాతల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. అయితే గణేష్ పక్షవాతానికి గురికావడంతో సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. మిత్రుల సహకారంతో ఎంజీఎం ఆస్పత్రి నుంచి సదరం ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నాడు. తనకు పింఛన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు గణేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. దీనస్థితిలో ఉన్న గణేష్‌ను కుటుంబీకులు భారంగా భావిస్తుండటంతో మనసులోని బాధను ఎవరితో చెప్పుకోలేక కుమిలి పోతున్నాడు. ఇప్పటికై నా పింఛన్ అందించి ఆదుకోవాలని గణేష్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment