వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటిపన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. పన్ను వసూళ్లపై బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఐల వారీగా సమీక్షించారు. ప్రతీ బిల్‌కలెక్టర్ రోజూ 100 రెసిడెన్షియల్‌లతోపాటు 20 కమర్షియల్ వసూళ్లు జరపాలని ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది వద్ద వసూళ్ల సంబంధిత అసెస్మెంట్ జాబితా, పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించాల్సిన వంద మంది జాబితా, 200 మంది డిఫాల్టర్ల జాబితాలు అందుబాటులో ఉంచుకొని వసూలు చేయాల్సిందేనన్నారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల లక్ష్యం రూ.11,731.84 లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.5,030.29 లక్షలు (42.88శాతం) అధిగమించాచారని, నల్లా పన్ను లక్ష్యం రూ.6687.7 లక్షలు కాగా రూ.1207.38 లక్షలు (18.05శాతం) వసూళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31లోగా రూ.121.91కోట్లు వసూలు చేయాలని గుర్తు చే శారు. అదనపు కమిషనర్ జోనా,డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్‌ఓలు యూసుపొద్దీన్, శ్రీనివాస్, షహజాదిబేగం, ఐటీ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి
పార్కుల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉద్యాన వన విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. నగర వ్యాప్తంగా 38 పార్కులలో పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఏదైనా ఒక పార్క్‌ను ప్రయోగాత్మకంగా ఎంచుకొని డ్రిప్ ద్వారా నీటిని పిచికారీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ అధికారులు రమేష్ ,లక్ష్మారెడ్డి, అసిస్టెంట్‌లు ప్రిన్సి, ప్రవల్లిక, ప్రియాంక, అనూహ పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో
కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
Comments
Please login to add a commentAdd a comment