
బాలల రక్షణలో పేరెంట్స్‌దే కీలకపాత్ర
● అడిషనల్ డీసీపీ ఎన్.రవి
హన్మకొండ: బాలలను ఆన్‌లైన్ వేధింపుల నుంచి రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని వరంగల్ పోలీసు కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో వరంగల్, హనుమకొండ జిల్లాలోని ఎంపిక చేసిన తల్లిదండ్రులకు ‘ఆన్‌లైన్‌లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు–దానిని నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై వర్క్‌షాపు జరిగింది. అడిషనల్ డీసీపీ ఎన్.రవి మాట్లాడుతూ మారుతున్న సమాజంలో ప్రతీ ఒక్కరికి ఇంటర్‌నెట్ జీవన విధానంలో భాగమైందని, వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కౌమార బాలలు దీని బారిన పడుతున్నారన్నారు. బాలలను వేధింపులకు గురి చేస్తే 1930, 100, 1098 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకన్న, మై చాయిస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జె.క్రాంతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితారెడ్డి, హనుమకొండ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికి సుధాకర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ఎస్.భాస్కర్, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీకాంత్, మేనేజర్ అజయ్ కుమార్, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment