
పీడీఎస్‌యూ నాయకుల నిరసన
కేయూ క్యాంపస్ : అమెరికాలోని భారతీయ వలసదారులను అక్రమంగా బంధించి వెనక్కి పంపుతున్న ఆ దేశాధ్యక్షుడి చర్యలను, అలాగే మోదీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం కేయూ మొదటి గేట్‌వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికా తన నూతన ఆర్థికవిధానాలు ఇతర దేశాలపై బలవంతంగా రుద్దారని దీంతో వివిధ దేశాల్లో వలసలు పెరిగాయన్నారు. విద్యా, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి మనుగడ అధ్యక్షుడి చర్యలతో జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అక్రమ వలసదారులంటూ భారతీయులపై అమెరికా అధ్యక్షుడి చర్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కావ్య, అనూష, కన్వీనర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment