నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ, ఇతర అభివృద్ధి పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధి సుందరయ్య నగర్‌లో సీసీ రోడ్‌డ్రెయిన్, 18వ డివిజన్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని కమ్యూనిటీ హాల్, చింతల్‌లో సీసీరోడ్డు డ్రెయిన్, 33వ డివిజన్ శాంతినగర్‌లో కొనసాగుతున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. హనుమకొండ పరిధి హసన్‌పర్తి భీమారంలో సీసీరోడ్ డ్రెయిన్ పనులను కమిషనర్ కొలతల ద్వారా పరిశీలించారు. ఆమెవెంట ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు రవి కిరణ్, రాజ్ కుమార్, ఏఈలు ముజామిల్, సతీశ్, స్మార్ట్ సిటీ పీఎంసీ భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరాజు ఉన్నారు.
తడి, పొడిచెత్తను వేరుగా అందించాలి
తడి, పొడిచెత్తను వేరుగా అందించడంపై నగరవాసులకు అవగాహన కల్పించాలని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా 56వ డివిజన్ గోపాల్‌పూర్‌లో తడి పొడిచెత్తను వేరు చేసి అందించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై శానిటరీ సిబ్బందికి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తడి, పొడిచెత్తను కలిపి అందించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, ఎంహెచ్‌ఓ రాజేశ్ , టీఏంసీ రమేశ్, సూపర్‌వైజర్లు నరేందర్, భాస్కర్, వావ్ ప్రతినిధి పవన్, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకపోతే
బిల్లుల్లో కోత
బల్దియా కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
Comments
Please login to add a commentAdd a comment