ఈజీఎస్‌లో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్దేశించిన వివిధ పనులను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఈజీఎస్ పనులపై ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, రానున్న మార్చి నాటికి సంబంధించి ఉపాధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం నిర్దేశిత పనులను పూర్తిచేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ కోసం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధ పనులు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు, కూలీలకు పనిదినాల సంఖ్యను పూర్తిస్థాయిలో కల్పించడం, నిర్దేశిత లక్ష్యాన్ని మార్చి నెల నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ శ్రీనివాస్ రావు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment