గ్రేటర్ వరంగల్ పరిధిలో గురువారం పలుచోట్ల కత్తుల దాడులు కలకలం రేపాయి. పోచమ్మమైదాన్ సమీపంలోని వాసవి కాలనీలో కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తామామలపై విరుచుకుపడ్డాడు. హసన్‌పర్తి మండలం మడిపల్లిలో జరిగిన పెళ్లిబరాత్‌లో ఇద్దరు కత్తిపోట్లకు గురికాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. భట్టుపల్లి రహదారిపై అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపాన కారును ఆపేసిన దుండగులు అందులోని ప్రయాణికుడిపై రాడ్లతో దాడి చేశారు. ఒకేరోజు మూడు ఘటనలు జరగడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment