కాజీపేట టు వరంగల్ ‘విజయ యాత్ర’
కాజీపేట రూరల్: శ్రీ రామనవమిని పురస్కరించుకొని హిందూ విజయ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ నాగపురి వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యాన ఆదివారం రాత్రి రాముడి విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కాజీపేట బాపూజీనగర్ సెంటర్–కడిపికొండ బ్రిడ్జి వద్ద వరంగల్ దుర్గేశ్వర స్వామి ఆలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీని విజయవాడ సనాతన భారతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ శరణానంద భారతీస్వామి, శ్రీరామ్‌ఉదయ్ విశ్వహిందూ పరిషత్ మహానగర కార్యదర్శి రానా యాదవ్ తదితరులు ప్రారంభించారు. ద్విచక్రవాహనాలు, కాషాయ జెండాలతో విజయయాత్ర సాగింది. కార్యక్రమంలో వెలగందుల రాజు, బీజేపీ మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, శ్రీరాముడి విగ్రహదాత డాక్టర్ తరుణ్‌రెడ్డి, బజరంగ్‌దళ్ మహానగర కన్వీనర్ అల్లకట్ల పాల్గొన్నారు.


