కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

Apr 7 2025 11:21 AM | Updated on Apr 7 2025 11:21 AM

కాంగ్

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

సన్న బియ్యం ప్రారంభోత్సవంలో నిరసన

వరంగల్‌ చౌరస్తా : వరంగల్‌ 27వ డివిజన్‌ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్‌ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్‌ చింతాకుల అనిల్‌, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్‌ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్‌ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్‌ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది.

నేడు వరంగల్‌ ప్రజావాణి

వరంగల్‌: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం(నేడు)ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు.

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

లీకేజీల గుర్తింపు

టన్నెల్‌లోకి దిగిన ఇంజినీర్లు

ధర్మసాగర్‌: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్‌ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్‌ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్‌ నుంచి రిజర్వాయర్‌ సమీపం వరకు పైపులైన్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్‌ వరకు టన్నెల్‌ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్‌ లీకేజీ అయ్యింది. పంపులు ఆపివేసి టన్నెల్‌ నుంచి డీ వాటరింగ్‌ చేశారు. ఆదివారం పైపు నుంచి టన్నెల్‌లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కు ని పరిశీలించారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి

ఖిలా వరంగల్‌/హన్మకొండ: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్‌, కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కార్యాలయాలతో పాటు శివనగర్‌, రంగశాయిపేటలో వేర్వేరుగా బీజేపీ జెండాలు ఆవి ష్కరించి మాట్లాడారు. దేశానికి పునర్వైభవం తెచ్చే దిశగా మోదీ పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురా లు రావు పద్మ, పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, కొల్లూరి యోగానంద్‌, రాణాప్రతాప్‌, కపిల్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ1
1/2

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ2
2/2

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement