మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి
● ప్రొఫెసర్ కాత్యాయని
హన్మకొండ: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని అన్నారు. శనివారం హనుమకొండలో మిస్ వరల్డ్ పోటీలపై అందాల పోటీల వ్యతిరేక కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ.. అందాన్ని ఆనందిస్తాం.. కానీ అందం పెట్టుబడి కావడమే సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ప్రతినిధి కళ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు దోచుకొని ఓటమికి గురయ్యారన్నారు. ఆయన అన్యాయాలు భరించలేకకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిస్తే.. గ్యారెంటీలను గాలికి వదిలి లాభాలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో రత్నమాల, రమాదేవి, వెంగల్‌రెడ్డి, అంజనీ, విలాసిని, జ్యోతికరమణి పాల్గొన్నారు.
ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయం
● కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత నవీన్
విద్యారణ్యపురి: న్యాయవాది కేఎస్‌ఆర్ జి.ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయమని ప్రముఖ నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని నవీన్ నివాసంలో మిత్రమండలి, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కేఎస్‌ఆర్ జి.ప్రసాద్ జీవితం, కృషి, వర్తమానం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రసాద్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో రచయిత, విమర్శకుడు మెట్టు రవీందర్, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, న్యాయవాది దివంగత కేఎస్‌ఆర్ జి.ప్రసాద్ కుమారుడు డాక్టర్ సతీశ్‌చంద్ర, మిత్ర మండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి, తెరసం అధ్యక్షుడు పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, రుద్రమ సాహిత్య సామాజిక వేదిక బాధ్యురాలు కొమర్రాజు రామలక్ష్మీప్రసాద్ జీవితాన్ని పరిచయం చేశారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, పి.చందు, బిల్ల మహేందర్, చందనాల సుమిత్రాదేవి, డి.శశికిరణ్, శ్యామల, అంజనీదేవి, సింగరాజు రమాదేవి పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి


