
హిమాయత్‌నగర్: యూట్యూబ్‌లోని వీడియోస్‌కు లైక్, షేర్, కామెంట్ చేస్తే కోటీశ్వరుడిని చేస్తామంటూ ఓ మహిళ రిటైర్డ్ ఆర్మీ అధికారికి వల వేసి అందినంత దోచేసింది. తీరిగ్గా ఇంట్లో ఉంటున్న సదరు అధికారి సైబర్‌నేరగాళ్లు చెప్పిన మాటలకు విని లింకులు ఓపెన్ చేసి లైక్, కామెంట్, షేర్ చేశాడు. తొలి రోజుల్లో కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత లెవెల్స్ రీచ్ కావాలంటూ పలు దఫాలుగా రూ.20 లక్షలకు పైగా దోచుకున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగరానికి చెందిన వ్యక్తి ఆర్మీలో ఉన్నతహోదాలో పనిచేసి కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. ఇటీవల అదవిసారా అనే యువతి టెలిగ్రామ్ ద్వారా అతడికి పరిచయమైంది. ఇంట్లో ఉంటూ బోర్ కొట్టకుండా ఉండేలా ఓ పని చెప్తానంటూ.. అది చేస్తే కోటీశ్వరులు కావొచ్చని ఆశ చూపింది. ఇందుకు అంగీకరించడంతో ఆయనకు తొలి రోజుల్లో యూట్యూబ్ లింకులు పంపి లైక్, కామెంట్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసినందుకు డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత లెవెల్–ఏ, లెవెల్–బీ అంటూ మాయ మాటలు చెప్పి రూ.20లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment