Retired army Employee
-
వీడియోస్‌కు లైక్, షేర్, కామెంట్ చేస్తే కోటీశ్వరుడిని చేస్తామంటూ
హిమాయత్‌నగర్: యూట్యూబ్‌లోని వీడియోస్‌కు లైక్, షేర్, కామెంట్ చేస్తే కోటీశ్వరుడిని చేస్తామంటూ ఓ మహిళ రిటైర్డ్ ఆర్మీ అధికారికి వల వేసి అందినంత దోచేసింది. తీరిగ్గా ఇంట్లో ఉంటున్న సదరు అధికారి సైబర్‌నేరగాళ్లు చెప్పిన మాటలకు విని లింకులు ఓపెన్ చేసి లైక్, కామెంట్, షేర్ చేశాడు. తొలి రోజుల్లో కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత లెవెల్స్ రీచ్ కావాలంటూ పలు దఫాలుగా రూ.20 లక్షలకు పైగా దోచుకున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన వ్యక్తి ఆర్మీలో ఉన్నతహోదాలో పనిచేసి కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. ఇటీవల అదవిసారా అనే యువతి టెలిగ్రామ్ ద్వారా అతడికి పరిచయమైంది. ఇంట్లో ఉంటూ బోర్ కొట్టకుండా ఉండేలా ఓ పని చెప్తానంటూ.. అది చేస్తే కోటీశ్వరులు కావొచ్చని ఆశ చూపింది. ఇందుకు అంగీకరించడంతో ఆయనకు తొలి రోజుల్లో యూట్యూబ్ లింకులు పంపి లైక్, కామెంట్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసినందుకు డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత లెవెల్–ఏ, లెవెల్–బీ అంటూ మాయ మాటలు చెప్పి రూ.20లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
ఏం జరిగిందని ప్రశ్నించారని..పోలీసులపైకి గన్ గురిపెట్టి...
సాక్షి, పంజాగుట్ట: పోలీసులపైకి గన్ చూపించిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లైసెన్స్డ్ గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట నాగేంద్ర రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్‌బజార్ వీధిలో ట్రాన్స్‌జెండర్స్‌తో గొడవ పడుతున్నాడు. గమనించిన పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవీంద్రబాబులు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. దీంతో వెంకట నాగేంద్ర రెడ్డి తనవద్ద ఉన్న గన్ను పోలీసులకు గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద ఉన్న గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ దాని గడువు అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ గురిచూపినా బెదరకుండా చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ సాయికుమార్, హోం గార్డు రవీంద్రబాబులను నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అభినందించారు. వారికి ఒక్కొక్కరికీ 2500 క్యాష్ రివార్డు, జ్ఞాపికను అందించారు. (చదవండి: ‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్ ) -
వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్‌పై చేయడంతో...
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సులభంగా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వర్క్‌ఫ్రమ్ హోం వలలో చిక్కుకుని ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రూ.20 లక్షలు కోల్పోయాడు. తీరా తనను దగా చేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం పేరుతో వచ్చిన ఓ లింకును క్లిక్ చేశాడు. చదవండి: చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో.. వారి సూచనలు పాటించడంతో రూ.20 నుంచి రూ. 20లక్షల వరకు ఆన్లైన్ పేమెంట్‌ను చెల్లించాడు. రూ.20 లక్షలకు రూ.40 లక్షలు ఇస్తామని, రూ.40 లక్షలు పొందాలంటే తొలుత రూ.8 లక్షలు పన్ను చెల్లించాలని మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కొటాలకు చెందిన యువకుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులకు తెలిసింది. ఆ యువకుడు పరువుపోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
తిరుపతిలో తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యం
చిత్తూరు: అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శుక్రవారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి స్వామిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్వామిరెడ్డిపై దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా.. నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని స్వామిరెడ్డి వాపోయారు. -
పెన్షన్ కోసం ఆర్మీ మాజీ ఉద్యోగి నిర్వాకం
తాడేపల్లి రూరల్ : పూర్తిస్థాయి పింఛను పొందేందుకు వివాహమైందని నకిలీ పత్రాలు సృష్టించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి నిర్వాకం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పేద వివాహిత ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం ముగ్గురోడ్డు ప్రాంతంలో నివసించే ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి భార్య నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మరణించింది. దీంతో ఆర్మీ నుంచి వచ్చే పింఛనులో సగం కోత విధించారు. మరలా వివాహం చేసుకున్నట్లు పత్రాలు సమర్పిస్తే మొత్తం పింఛను పొందే అవకాశం ఉందని ఓ అధికారి సలహా ఇవ్వడంతో.. నకిలీ పెళ్లి పత్రాలు సృష్టించేందుకు విఫలయత్నం చేశాడు. నిరుపేద వివాహితకు తెలియకుండా... ముగ్గురోడ్డు ప్రాంతానికే చెందిన ఓ నిరుపేద వివాహితకు తెలియకుండానే ఆమెను వివాహం చేసుకున్నట్లు సదరు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి పత్రాలు తయారు చేశాడు. ఇళ్ల స్థలం ఇప్పిస్తామంటూ ఆ ఏరియాకు చెందిన టీడీపీ చోటా నేత వివాహిత మహిళ నుంచి ఆధార్‌కార్డు, ఓటుకార్డు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం ఓ పాస్టర్ ద్వారా పెళ్లి అయినట్లు పత్రాలు తయారు చేశారు. ఈ వ్యవహారం గురించి వివాహితకు ఇసుమంత కూడా తెలియకపోవడం విశేషం. స్థలం ఇప్పిస్తారనే ఆశతో ఆమె తనకు చెందిన గుర్తింపు కార్డులు, ఫొటోలు టీడీపీ నేతకు ఇచ్చింది. -
చిన్నారిని చితకబాదిన రిటైర్డ ఉద్యోగి
హిందూపురం: చదువుకోలేదన్న నెపంతో చిన్నారిని ఓ రిటైర్డ ఆర్మీ ఉద్యోగి చితకబాదిన సంఘటన హిందూపురం పట్టణం సడ్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నారి తల్లి రాధ అలియాస్ తొల్ల సంగీతకు ఐదేళ్ల చిన్నారి తారుణ్య ఉంది. ఈమె సడ్లపల్లిలోని ఓ గార్మెంట్ షాప్‌లో పనిచేస్తోంది. చిన్నారిని అక్కడే నివాసముంటున్న రిటైర్డ ఆర్మీ ఉద్యోగి తిప్పేస్వామి ఇంట్లో వదిలి పెట్టి వెళ్లింది. ఆ ఉద్యోగికి ఇద్దరు భార్యల విషయంలో గొడవైంది. ఈ క్రమంలో అసహనంగా ఉన్న తిప్పేస్వామి అక్కడే ఉన్న చిన్నారి చదువుకోలేదనే నెపంతో బెల్టుతో చితకబాదాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన చిన్నారి తారుణ్యను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తిప్పేస్వామి పరారయ్యాడు. ఘటనపై తారుణ్య తల్లి రాధను విచారించామని, తిప్పేస్వామి నివాసముంటున్న ప్రాంతంలోనే ఆమె కాపురముండటంతో ఘటన జరిగిందని, టూటౌన్ సీఐ మధుభూషన్ తెలిపారు. తల్లి అశ్రద్ధ కారణంగానే చిన్నారికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తారుణ్యను ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మూగ బాలికపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అత్యాచారం
-
మూగ బాలికపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అత్యాచారం
గుంటూరు: మహిళలు, బాలికల రక్షణకు కఠిన శిక్షలతో అభయ చట్టం రూపొందించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. అత్యాచారాల వంటి అమానుష ఘటనలు ఏమాత్రం అదుపులోకి రాలేదు. రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విజయవాడలో ఓ బాలికను గదిలో బంధించి నెల రోజులుగా అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఈ ఉదయమే వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా నగరం మండలం చినమట్లపూడి గ్రామంలో ఇప్పుడు మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ మూగ బాలికపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.