తిరుపతిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి స్వామిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
చిత్తూరు: అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శుక్రవారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి స్వామిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్వామిరెడ్డిపై దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా.. నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని స్వామిరెడ్డి వాపోయారు.