కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని, ఆయన ఎక్కడికి వెళ్లారన్న సంగతి తెలియదని స్థానిక మీడియా సంస్థ ‘టోలో’ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. భద్రత విషయంలో సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, తాలిబన్ బలగాలు కాబూల్‌లోకి పూర్తిగా ప్రవేశించేముందు చర్చలకు కొంత సమయం కేటాయించాలని హైకోర్టు కౌన్సిల్ ఫర్ నేషనల్ రికన్సిలియేషన్(హెచ్‌సీఎన్‌ఆర్) అధినేత అబ్దుల్లా పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇతర దేశాల ప్రజలు తమ దేశానికి పయనమవుతున్నారు. ఆ దేశంలో నివాసం ఉంటున్న వారిని వెనక్కు తెచ్చేందుకు ఆయా దేశాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 129 మంది భారతీయులతో ఓ ఎయిరిండియా విమానం కాబూల్ నుంచి ఢిల్లీ బయల్దేరింది.
Comments
Please login to add a commentAdd a comment