thalibans
-
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
-
మ్యాగజైన్ స్టోరీ 31 August 2021
-
హృదయ విదారకం: విమాన టైర్లలో మానవ శరీర భాగాలు, అవయవాలు
కాబూల్: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా అమెరికా దీనికి సంబంధించి ఒక హృదయ విదారక ఘటనను వెల్లడించింది. గతంలో తాలిబన్ల చీకటి పాలన రోజులు మళ్ళీ మొదలు కానుందని భావించిన ఆఫ్గన్ ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో టర్మాక్‌పై కూర్చున్న కొందరు విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కింద పడ్డారు. ఆ హృదయ విదారక దృశ్యాలు మనల్ని కలిచివేశాయి. అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం లో ఖాళీ లేక కొందరు ఆఫ్గన్లు విమానం వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందికి పైగా వెళ్లిన ఆ విమానం ఖతార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ అధికారులకి మరో షాక్ తగిలింది. విమాన చక్రం భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు కనిపించాయని అధికారులు తెలిపారు. సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపట్లోనే వందలాది మంది విమానం ఎక్కారో తమకు తెలియదని అమెరికా అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్నట్లు కనిపించడంతో వెంటనే సీ-17 విమానాన్ని కాబూల్ నుంచి తరలించామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో వెలుగు చూసిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతిచెందగా, ఎంత మంది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే.. -
తాలిబన్లపై మాకు నమ్మకం లేదు : అఫ్గాన్ యువత
-
Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు..
-
అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్
రామ్ గోపాల్ వర్మ.. సంచలనాలకు మారు పేరు ఇది. ఈ వివాదాస్పద దర్శకుడు ఎప్పుడు, ఏం అంశంపై, ఎలా స్పందిస్తారో ఆయనకే తెలియదు. విషయం ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై స్పందించారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించన వీడియోని షేర్ చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్ చేశాడు. U can see what kind of animals the taliban are just by how they are eating food in the Presidential palace pic.twitter.com/lSXb9uyhsJ — Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2021 అలాగే కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియో షేర్ చేస్తూ.. 'ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్' అంటూ ఆర్టీజీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Finally the truth ..The Taliban are just kids 😂 https://t.co/j8Y5itNo6Y — Ram Gopal Varma (@RGVzoomin) August 17, 2021 చదవండి: ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? -
తాలిబన్ల కీలక ప్రకటన
-
Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్లో ఆడతారా?
గతంలో ఆఫ్ఘనిస్థాన్ దేశం తాలిబన్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చడంతోపాటు అక్కడి క్రికెట్ కూడా ఎంతో పురోగతి సాధించింది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి నుంచి రషీద్ ఖాన్ లాంటి ఆటగాడు ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్ గా ఎదిగి అంతర్జాతీయ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలాంటి ఆటగాళ్ళు వచ్చే నెలలో జరిగే ఐపీఎల్లో ఆడతారా లేదా అనేది తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అనుమానంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరూ ఆఫ్ఘనిస్థాన్‌లో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడటం కోసం యూకేలో ఉన్నారు. రషీద్ ట్రెంట్ రాకెట్స్‌కు, నబీ లండన్ స్పిరిట్స్‌కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్కడి నుంచి నేరుగా యూఏఈ వచ్చి ఐపీఎల్లో పాల్గొంటారా లేదా అనేదానిపై ఇంకా ఏటువంటి స్పష్టత లేదు. మరో పక్క వాళ్లు వస్తారన్న నమ్మకం తమకు ఉన్నదని బీసీసీఐ చెబుతోంది. కాకపోతే ఇప్పుడే దీనిపై కచ్చితంగా ఏమి చెప్పలేము, తాజా పరిస్థితులను గమనిస్తున్నట్లు పేర్కొంది. యుకే లో టోర్నీ ముగిశాక కూడా రషీద్, నబీ అక్కడే వుంటే మన వాళ్లతో కలిపి ఒకే విమానంలో తీసుకువచ్చే ప్రయత్నం బీసీసీఐ చేయాలని భావిస్తోంది. రషీద్, నబీ ఇద్దరూ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై అక్కడి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ మాట్లాడుతామని తెలిపింది. ఇప్పటికే తమ దేశాన్ని రక్షించాలంటూ రషీద్ ఖాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced.. Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan🇦🇫. We want peace.🙏 — Rashid Khan (@rashidkhan_19) August 10, 2021 -
దేశం విడిచి వెళ్లిపోయిన అశ్రఫ్ ఘనీ
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని, ఆయన ఎక్కడికి వెళ్లారన్న సంగతి తెలియదని స్థానిక మీడియా సంస్థ ‘టోలో’ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. భద్రత విషయంలో సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, తాలిబన్ బలగాలు కాబూల్‌లోకి పూర్తిగా ప్రవేశించేముందు చర్చలకు కొంత సమయం కేటాయించాలని హైకోర్టు కౌన్సిల్ ఫర్ నేషనల్ రికన్సిలియేషన్(హెచ్సీఎన్ఆర్) అధినేత అబ్దుల్లా పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇతర దేశాల ప్రజలు తమ దేశానికి పయనమవుతున్నారు. ఆ దేశంలో నివాసం ఉంటున్న వారిని వెనక్కు తెచ్చేందుకు ఆయా దేశాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 129 మంది భారతీయులతో ఓ ఎయిరిండియా విమానం కాబూల్ నుంచి ఢిల్లీ బయల్దేరింది. -
ఆఫ్ఘనిస్థాన్ నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘనీ!
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఆశ్రఫ్ ఘనీ రాజీనామా? చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కామాండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అబ్దుల్ ఘనీ.. ఆఫ్ఘాన్ ముజాహిద్ కమాండర్ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో ఓ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2010లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్ చేశారు. 2018 అక్టోబర్ 24 వరకు పాక్ జైలులో గడిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు. విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టం: తాలిబన్లు విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్లో ఉన్న విదేశీయులు రిజిస్టర్ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని తిరిగి రావాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. -
తాలిబన్లకు అధికారం అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
-
దోహా చర్చల్లో మనం
అంతర్జాతీయ వాతావరణం ఎలావుందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, మారిన పరిస్థితులకు తగినట్టు విధానాలు సవరించుకోనట్టయితే వెనకబడిపోవటం ఖాయం. ఈ సంగతిని మన దేశం ఆల స్యంగానైనా గ్రహించి అఫ్ఘానిస్తాన్ శాంతి చర్చల్లో పాలుపంచుకుంది. ఖతార్‌లోని దోహాలో అఫ్ఘాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఆదివారం నుంచి జరుగుతున్న చర్చల్లో మన దేశంతో పాటు 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఫిబ్రవరిలో అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదర డానికి రెండేళ్లముందు నుంచే వారిద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. అప్పటినుంచీ ఇందులో పాలుపంచుకోమని అమెరికా మన దేశాన్ని కోరుతోంది. 2001లో తమ గడ్డపై ఉగ్రదాడి తర్వాత భూగోళంలో ఏ మూలనున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని అమెరికా ప్రకటించి అఫ్ఘానిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. వరస దాడులతో తాలిబన్లు నష్టాన్ని చవిచూసిన మాట వాస్తవమే. బిన్‌లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది. ముల్లా ఒమర్‌ను కూడా హతమార్చింది. కానీ ఆ క్రమంలో అమెరికా కూడా భారీగా నష్టపోయింది. వేలాదిమంది సైనికులు బలయ్యారు. మరిన్ని వేలమంది గాయపడ్డారు. వేలాది కోట్ల డాలర్లు వెచ్చించినా ఈ యుద్ధం అంతమయ్యే జాడలు కనబడలేదు. ఈ పరిస్థితుల్లోనే 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ తాను గెలిస్తే అమెరికా సేనల్ని వెనక్కి తీసుకొ స్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దిశగా ఆయన అడుగులేశారు. తాలిబన్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, అందువల్ల వారితో సర్దుకుపోవాలని మన దేశానికి అప్పటినుంచీ ఆయన చెబుతున్నారు. కానీ గతంలో వారితో వున్న చేదు అనుభవాలరీత్యా మన దేశం అందుకు సిద్ధపడలేదు. తాలిబన్లు పాకిస్తాన్ ప్రాపకంలో పని చేస్తారన్నది బహిరంగ రహస్యం. 90వ దశకంలో వారు అఫ్ఘాన్‌ను చెరబట్టినప్పుడు కశ్మీర్లో వారు సాగించిన హత్యాకాండ, సృష్టించిన విధ్వంసం ఎవరూ మరిచిపోరు. తాలిబన్లు 1999లో మన ఎయిరిండియా విమానం హైజాక్ చేసి ఇక్కడి జైళ్లలో వున్న తమ సహచరులు ముగ్గుర్ని విడిపించు కున్నారు. ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు అమెరికా ఏదో విధంగా ఆ దేశం నుంచి బయటపడటం కోసం, అది సాధ్యమైనంత గౌరవప్రదంగా వుండటం కోసం తాపత్రయపడి తాలిబన్లతో ఒప్పందం చేసుకుంది. వారితో చర్చించేది లేదని భీష్మించుకుని కూర్చున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని సైతం ఒప్పించింది. ఆయన వద్దంటున్నా జైళ్లలో వున్న తాలిబన్ శ్రేణు లను విడిపించింది. ఆ ఒప్పందం తర్వాత కూడా గత ఆరునెలల్లో తాలిబన్లు స్త్రీలు, పిల్లలతోసహా 1,300మంది పౌరుల ప్రాణాలు తీశారని, అఫ్ఘాన్ జవాన్లు 3,560మంది వారి దాడుల్లో మరణించారని ఘనీ లెక్కలు చెప్పినా లాభం లేకపోయింది. ప్రస్తుత దోహా చర్చల్లో ఘనీ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొదట్లో ఈ చర్చలను గట్టిగా వ్యతిరేకించి, అందులో పాలుపంచుకోవడానికి నిరాకరించిన మన దేశం సహజంగానే ఇప్పుడు ‘బయటి దేశం’గా మిగిలింది. అయితే ఆలస్యంగానైనా ఇది మంచి నిర్ణయం. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో మన దేశం చురుగ్గా పాలుపంచుకుంది. పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది. ఔషధాలు, నిత్యావసరాలు అందించంలో మొదటినుంచీ ముందుంది. కానీ ఘనీ ప్రభుత్వం అవసరమైనంతగా బలపడలేదు. దేశంలోని కొన్ని నగరాలకూ, పట్టణాలకూ ప్రభుత్వం పరిమితంకాగా... విశాల గ్రామీణ ప్రాంతాలు మొదటినుంచీ పూర్తిగా తాలిబన్ల నియం త్రణలో వున్నాయి. పాకిస్తాన్ జైల్లో పదేళ్లుగా బందీగావున్న తాలిబన్ సహ సంస్థాపకుడు ముల్లా అబ్దల్ ఘనీ బరాదర్‌ను పాక్ పాలకులు ఒప్పించి, అమెరికాతో రాజీ కుదుర్చుకోవడానికి సిద్ధపడే షరతుపై 2018లో విడిచిపెట్టారు. అప్పటినుంచీ తాలిబన్లపై పాక్ పట్టు పెరిగింది. ఆ కారణంతోనే మన దేశం ఈ శాంతి చర్చలకు దూరంగా వుంది. కానీ అక్కడ తాలిబన్లు ప్రధాన పాత్రవహించే ప్రభుత్వానికి దూరంగా వుండటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం వుండదన్న అవగాహనతో చివరకు మన దేశం ఈ సమావేశంలో పాల్గొంది. అలా పాల్గొన్నప్పుడే భవిష్య అఫ్ఘాన్ ఎలావుండాలన్న అంశంలో మన వాదన వినిపించడానికి, తగినంతగా ప్రభావితం చేయడానికి అవకాశం వుంటుం దన్న నిపుణుల సూచన కొట్టిపారేయదగ్గది కాదు. అయితే తాలిబన్ల తాజా ప్రకటనల తీరు చూస్తే వారిలో మార్పు వచ్చిందంటున్న మాటలు ఎంతవరకూ సరైనవన్న సందేహాలు తలెత్తుతాయి. కాల్పుల విరమణ ప్రకటించాలన్న అఫ్ఘాన్, అమెరికాల వాదనను వారు ఒప్పుకోవడం లేదు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి మూల కారణమేమిటో చర్చించకుండా కాల్పుల విరమణ అంటే ఎలా అని తాలిబన్ ప్రతినిధులు ప్రశ్నిస్తు న్నారు. గత అయిదారురోజులుగా సాగుతున్న చర్చంతా ప్రధాన చర్చలకు ప్రాతిపదిక ఏర్పర్చడం కోసమే. కాల్పుల విరమణపై ఈ ప్రాథమిక చర్చల్లోనే ప్రతిష్టంభన ఏర్పడటం అనేక సందేహాలు కలిగిస్తోంది. అఫ్ఘాన్‌లో వున్న వివిధ మిలిటెంటు సంస్థల్లో తాలిబ¯Œ ప్రధానమైనది. ఇతరులతో పోలిస్తే తాలిబన్ల బలం అధికమే అయినా అది కూడా అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతోంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా అది పాకిస్తాన్ ప్రాపకంతోనే అడుగులేస్తుంది. ఉన్నకొద్దీ అఫ్ఘాన్‌లో తన పలుకుబడి మరింత పెంచుకుంటుంది. మహిళల హక్కులపై, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుపై తాలిబన్లు ఇంతవరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఉదారవాదులుగా ముద్రపడ్డ షేర్ మహమ్మద్ అబ్బాస్, ముల్లా బరాదర్లను చివరి నిమిషంలో తప్పించి ఛాందసవాది మలావీ హక్కానీని చర్చలకు పంపడంలోనే ఇలాంటి అంశాల్లో తాలిబన్ల వైఖరేమిటో చెబుతోంది. తమ గడ్డను ఉగ్రవాదుల అడ్డాగా మారనీయబోమని తాలిబన్లు అంటున్నారు. ఉన్నంతలో ఇదొక్కటే మనకు అనుకూలమైన అంశం. కనీసం తాలిబన్లను దీనికైనా కట్టుబడి వుండేలా చేయగలిగితే, వారిని తటస్తులుగా ఉంచగలిగితే ఉన్నంతలో అది మేలే. -
అఫ్ఘాన్‌పై అప్రమత్తత
ఎవరేమనుకున్నా తాలిబన్లు పరివర్తన చెందారని నూరు శాతం నమ్ముతున్న అమెరికా ఆ సంస్థతో సర్దుకుపొమ్మని బుధవారం మరోసారి భారత్‌కు సలహా ఇచ్చింది. మొన్న ఫిబ్రవరిలో ఆ సంస్థతో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందూ, ఆ తర్వాతా కూడా మన దేశం అమెరికాకు తన అసంతృప్తిని తెలియజేసింది. కానీ వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా అఫ్ఘాన్ వ్యవహారం ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆత్రంగా వున్నారు. అధికారం అప్పగిస్తే అఫ్ఘాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకొస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ వాగ్దానం చేశారు. అది నెరవేర్చినట్టు కనబడటం కోసమే ఈ ఆత్రమంతా. ఆయన అవసరాల మాటెలావున్నా అమెరికా నిర్ణయం వల్ల ఇబ్బందులేర్పడతాయని మన దేశం భావిస్తోంది. అఫ్ఘాన్‌లోకి అమెరికా సేనలు ప్రవేశించి 19 ఏళ్లవుతోంది. ఆ దేశంలోని ఉగ్రవాద ముఠాలను అంతమొందిస్తానని 2001లో ప్రకటించి వెళ్లిన అమెరికా వరస నష్టాలు చవిచూసింది. వేలాదిమంది సైనికులు బలయ్యారు. ఎందరో గాయపడ్డారు. వేల కోట్ల డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది. అది అమల్లోకి తెచ్చిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. దేశంలోని మూడోవంతు భాగం పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి పోగా, మిగిలిన ప్రాంతంలో నిత్యం అశాంతే. మందుపాతరలు, కారుబాంబులు పేలు తుండటం, పదులకొద్దీమంది మరణించడం అక్కడ రివాజు. దేశ రాజధాని కాబూల్‌లోకి సైతం ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించడం కొనసాగుతూనేవుంది. ‘గ్రీన్‌జోన్’ పేరిట అమెరికా కార్యాలయాలన్నిటినీ పటిష్టమైన భద్రత మధ్య నడిపిస్తున్నా ఆ ప్రాంతం సైతం ఉగ్రవాదుల దాడు లతో దద్దరిల్లుతూనే వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సేనలు అక్కడుండి సాధించేదేమీ లేదన్నది వాస్తవం. కానీ దశాబ్దాలపాటు ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అక్కడ ఉగ్రవాదం పెరగడానికి, ప్రత్యేకించి తాలిబన్లు పుట్టుకురావడానికి కారణమైన అమెరికా ఇప్పటి కిప్పుడు తన స్వప్రయోజనాల కోసం ఒప్పందం పేరిట ఏదో ఒకటి కుదుర్చుకుని పలాయనం చిత్త గించాలని చూడటం ఈ ప్రాంతాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. అఫ్ఘాన్‌లో ఒక్క తాలిబన్లు మాత్రమే లేరు. అక్కడ అనేక ఉగ్రవాద ముఠాలున్నాయి. తాలిబన్లే భిన్న రకాల వ్యక్తుల సమూహం. వీరెవరూ ప్రస్తుత దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని లేదా ఆయన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాను గుర్తించడం లేదు. నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో తానే గెల్చినట్టు ఘనీ ప్రకటించుకోగా, అసలు విజేతను తానేనని అబ్దుల్లా చెప్పుకున్నారు. అంత టితో ఆగక దేశాధ్యక్షుడినంటూ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఒకపక్క తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని, అక్కడినుంచి త్వరగా బయటపడాలని చూస్తున్న అమెరికాకు వీరిద్దరి గొడవా పెద్ద అడ్డంకిగా మారింది. కనుకనే తెరవెనక మంతనాలు జరిపి ఈ నేతలిద్దరి మధ్యా అవగాహన కుదిర్చింది. అధికార పంపకంపై వారొక ఒప్పందానికొచ్చారు. అయితే వారిద్దరూ తెరమరుగు కావడం, తాలిబన్లు అధికారంలోకి రావడం ఇక ఎంతో దూరంలో లేదు. కానీ మన దేశం పరిస్థితేమిటన్నదే ప్రశ్న. తాలిబన్లకూ, ఇతర ఉగ్రవాద ముఠాలకూ పాకిస్తాన్ మద్దతు వుందన్నది బహిరంగ రహస్యం. ఈ ముఠాలన్నీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నియంత్రణలోనే పనిచేస్తాయి. ఇదంతా తెలిసినా... అటు పాకిస్తాన్ నుంచీ, ఇటు తాలిబన్ల నుంచీ ప్రాంతీయ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ లేకుండానే అమెరికా ఒప్పందం చేసుకుంది గనుక మన దేశం తన ప్రయోజనాల పరిరక్షణకు సొంతంగా వ్యూహ రచన చేసుకోక తప్పదు. తాలిబన్లతో మనకు చేదు అనుభవాలున్నాయి. పాతికేళ్లక్రితం అఫ్ఘాన్‌లో అధికారం చలాయించినప్పుడు పాక్ ఆదేశాలతో కశ్మీర్‌కు ఉగ్రవాదుల్ని తరలించి అక్కడ నెత్తురుటేర్లు పారించిన చరిత్ర తాలిబన్లది. అలాగే మన విమానాన్ని హైజాక్ చేసి జైళ్లలోవున్న ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. వారు మరోసారి అధికారంలోకొస్తే ఆ మాదిరి అరాచకాలు సాగవన్న గ్యారెంటీ ఏం లేదు. పాకిస్తాన్–అఫ్ఘాన్ సరిహద్దుల్లో వందలాది ఉగ్రవాద శిబిరాలున్నాయి. అవి కొనసాగినంతకాలమూ మన దేశానికి సమస్యలు తప్పవు. భారత్ మా మిత్ర దేశమని తరచు చెప్పే ట్రంప్‌కు ఇవి గుర్తుకురాలేదు. భారత్ విషయంలో తాలిబన్ల నుంచి స్పష్టమైన హామీ తీసుకోవాలన్న స్పృహ లేదు. తాము భారత్‌తో సఖ్యంగా వుంటామని ఈమధ్య తాలిబన్ ప్రతినిధి ప్రకటించాడు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కూడా ఆయన చెప్పాడు. తాలిబన్ విధాన నిర్ణాయక కమిటీ షురా పాకిస్తాన్‌లోని క్వెట్టాలో వుంటుంది గనుక ఈ ప్రకటనను ఎంతవరకూ నమ్మవచ్చునో ఎవరికీ తెలియదు. ఒకవేళ తాలిబన్ల అభిప్రాయం అదే అయినా... పాక్ చిచ్చుపెట్టకుండా మౌనంగా వుంటుందా అన్నది ప్రశ్న. అయితే ఎటూ అఫ్ఘాన్‌లో అధికారం చేజిక్కించుకోబోతున్నది కనుక మన దేశం తాలిబన్ సంస్థతో ఏదో మేరకు అంగీకారానికి రాక తప్పదు. వారినుంచి కశ్మీర్‌కు ఉగ్రవాద బెడద లేకుండా చేయగలగటం అన్నది భారత్ ప్రస్తుత కర్తవ్యం. వారితో సైనికంగా తలపడితే అది పాక్‌కు మరింత సన్నిహితమవుతుంది. ఒకపక్క ఇరుగుపొరుగు దేశాలతో మన సంబంధాలు అంతంతమాత్రం. నేపాల్ సైతం భారత్‌పై గుర్రుగా వుంది. ఈ పరిస్థితుల్లో తాలిబన్ రూపంలో మరో సమస్య తలెత్తకుండా చూడటం ముఖ్యం. తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయమీయబోమని ఈమధ్యే తాలిబన్ ప్రతినిధి ఆన్లైన్ సదస్సులో చెప్పాడు. ఇప్పటికే మన దేశం అఫ్ఘాన్ పునర్ని ర్మాణానికి 300 కోట్ల డాలర్లు వ్యయం చేసింది. భారత్‌తో సుహృద్భావ సంబంధాలుంటే అటువంటి సహకారం కొనసాగుతుందన్న అభిప్రాయం తాలిబన్లకు కలగజేస్తే అది ప్రయోజనకరం కావొచ్చు. ఏదేమైనా అఫ్ఘాన్ విషయంలో భారత్ ఆచితూచి అడుగేయక తప్పదు. -
కిడ్నాప్.. అంతలోనే విముక్తి
కాబూల్ : బక్రీద్ పర్వదినానికి ముందు అఫ్గాన్‌లో అలజడి సృష్టించాలన్న తాలిబన్ల ప్రయత్నానికి ఆ దేశ భద్రతా దళాలు దీటైన జవాబిచ్చాయి. సోమవారం టాఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ వెళ్తున్న 3 బస్సులపై ఖాన్ అబాడ్ జిల్లాలో మెరుపుదాడికి దిగిన తాలిబన్లు సుమారు 170 మంది ప్రయాణికులను నిర్భందించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు కొద్ది గంటల్లోనే కిడ్నాప్‌కు గురైన వారిలో సుమారు 149 మంది ప్రయాణికులను తాలిబన్ల చెర నుంచి కాపాడాయి. మరో 21 మంది ప్రయాణికులను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భద్రతా బలగాల దాడిలో ఇప్పటివరకు ఏడుగురు తాలిబన్లు హతమయ్యారు. బక్రీద్ పండుగకు ఇళ్లకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా తాలిబన్లు ఈ దాడికి తెగబడి ఉండవచ్చని ప్రావిన్స్ కౌన్సిల్ ఉన్నతాధికారి మహ్మద్ యూసఫ్ వెల్లడించారు. ప్రస్తుత ఘటన చోటుచేసుకున్న ప్రాంతం తాలిబన్ల అధీనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇటీవల మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని తాలిబన్లను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించని తాలిబన్లు బక్రీద్‌కు రెండ్రోజుల ముందు ఏకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. -
అఫ్గాన్‌లో ఏడుగురు భారతీయుల కిడ్నాప్
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు అపహరణకు గురయ్యారు. అఫ్గాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో భారత్‌కు చెందిన ఒక కంపెనీ తరఫున విద్యుత్ కాంట్రాక్ట్ పనుల్ని పర్యవేక్షిస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబన్లు అపహరించారని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ ఉద్యోగులైన వీరంతా ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సులో విద్యుత్ నిర్వహణ పనుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక న్యూస్ చానల్ తెలిపింది. ఇంజనీర్లతో పాటు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌ను బాగ్లాన్ ప్రావిన్స్ రాజధాని పుల్–ఇ–ఖొమ్రిలోని బాగ్–ఇ–షమల్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు అపహరించినట్లు వెల్లడించింది. కాబూల్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కూడా ఇంజనీర్ల కిడ్నాప్‌ను నిర్ధారించారు. కిడ్నాప్‌కు గురైన ఏడుగురు భారతీయులు అఫ్గాన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కిడ్నాపునకు గురైన వీరంతా ఏ రాష్ట్రం వారో ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆర్పీజీ గ్రూపు అనుబంధ కంపెనీయే కేఈసీ ఇంటర్నేషనల్.. మా ఉద్యోగుల్ని కాపాడండి: ఆర్పీజీ చైర్మన్ ఈ ఉదంతంపై బాగ్లాన్ గవర్నర్ అబ్దుల్లా నెమటి మాట్లాడుతూ.. ‘భారతీయ ఇంజనీర్లను బందీలుగా పట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులు వారిని పుల్–ఇ–ఖొమ్రిలోని దండ్–ఇ–షహబుద్దీన్ ప్రాంతానికి తరలించారు. స్థానిక ప్రజల సాయంతో తాలిబన్ ఉగ్రవాదులతో అఫ్గాన్ అధికారులు మాట్లాడారు. భారతీయుల్ని అపహరించినట్లు ఉగ్రవాదులు అంగీకరించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు గా భావించి వారిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు’ అని చెప్పారు. స్థానిక గిరిజన నేతల మధ్యవర్తిత్వంతో అపహరణకు గురైన భారతీయుల్ని విడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని నెమటి తెలిపారు. మరోవైపు అపహరణకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. బాగ్లాన్ ప్రావిన్స్ నుంచి భారతీయుల అపహరణపై అఫ్గాన్ అధికారులతో సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేఈసీ కంపెనీ యాజమాన్య సంస్థ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంక ట్వీట్ చేస్తూ.. మా ఉద్యోగుల్ని కాపాడాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లోని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో దాదాపు 150 మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. 2016లో ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున పనిచేసేందుకు అఫ్గాన్ వెళ్లిన భారతీయ మహిళను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు 40 రోజుల అనంతరం విడుదల చేశారు. -
కాబూల్‌లో అంబులెన్స్ బాంబుతో తాలిబన్ దాడి
-
అఫ్గాన్‌లో మారణహోమం
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 95 మంది ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడిలో 151 మంది గాయపడ్డారు. అంబులెన్స్‌లో భారీగా పేలుడు పదార్థాలు నింపి దానిని పేల్చేయడంతో ఈ ఘోరం జరిగింది. ఏం జరిగిందో తెలియక కొద్ది సేపు షాక్‌కు గురైన ప్రజలు వెంటనే తేరుకుని పరుగులు తీశారు. పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించుకుంది. తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానీ నెట్వర్క్ పాత్ర ఉండవచ్చని అఫ్గాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే. భీతావహ వాతావరణం పేలుడు ధాటికి పలు భవంతులు, కార్యాలయాలు పాక్షికంగా ధ్వంసం కాగా.. మృతదేహాలు, రక్తమోడుతోన్న క్షతగాత్రులతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణాన్ని తలపించింది. రెండు కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు సైతం పగిలిపోయాయి. సమీపంలోని చిన్న భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉగ్రదాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోయారని, 151 మంది గాయపడ్డారని అఫ్గాన్ వైద్య శాఖ ప్రతినిధి వహీద్ చెప్పారు. అవయవాలు తెగిపడి, రక్తమోడుతున్న క్షతగ్రాతులతో కాబూల్‌లోని జమూరియతే ఆసుపత్రి నిండిపోయింది. ఇటాలియన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డేజన్ మాట్లాడుతూ.. 131 మంది క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పేలుడు ప్రాంతానికి సమీపంలోని షాపు యజమాని అమినుల్లా ఆ భీతావహ పరిస్థితిని వెల్లడిస్తూ‘మా బిల్డింగ్ ఊగిపోయింది. కిటికీ అద్దాలన్నీ పగిలిపోయాయి. మార్కెట్లోని ప్రజలంతా షాక్‌లో ఉన్నాం’ అని చెప్పారు. ‘పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. రక్తపు మడుగులు ప్రవహించాయి’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. పోలీసుల కళ్లుగప్పి.. నిరంతరం భారీ భద్రత నడుమ ఉండే ప్రాంతంలోనే పేలుడు జరగడంతో కాబూల్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలో అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల భవనాలు ఉన్నాయి. ‘ఆస్పత్రికి రోగిని తీసుకెళ్తున్నట్లుగా నటిస్తూ అంబులెన్స్ డ్రైవర్ వీధి ప్రారంభంలోని మొదటి చెక్‌పోస్టులో తనిఖీ లేకుండానే ముందుకెళ్లాడు. రెండో చెక్ పాయింట్ వద్ద పోలీసులు అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించగా వేరే దారిలోకి డ్రైవర్ వాహనాన్ని మళ్లించాడు. పోలీసులు అంబులెన్స్‌కు అడ్డుపడడంతో.. పేలుడు పదార్థాలతో నిండిన ఆ వాహనాన్ని డ్రైవర్ పేల్చేశాడు’ అని హోం శాఖ ప్రతినిధి నస్రత్ తెలిపారు. ఈ దాడిని నాటోతో పాటు, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కాబూల్ ఘటనను భారత్ తీవ్రంగా ఖండిస్తూ.. సూత్రధారుల్ని, వారి మద్దతుదారుల్ని చట్టం ముందు నిలబెట్టాలని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి -
ఒకే శబ్దం... ఒకే లయ అల్లాహ్
శబ్దం ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఈ ప్రకృతిలోని ఏ శబ్దమూ ఒకేలా ఉండదు. సృష్టిలోని అసంఖ్యాక జీవుల్లో దేని శబ్ద ప్రత్యేకత దానిదే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టే ఒక సంగీత జలధి. ప్రకృతిలోని శబ్దాల ఆధారంగానే మానవుడు వివిధ రకాల శబ్ద ప్రక్రియలకు శ్రీకారం చుట్టాడు. ప్రాకృతిక, ప్రాపంచిక, ఆధ్యాత్మికపరంగా వివిధ శబ్ద ప్రక్రియలు మనకు సుపరిచితమే. ఆధ్యాత్మికతతోపాటు భాషాపరంగా చూస్తే, అరబ్బీ భాషలోని శబ్ద ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. అరబ్బీ భాషాపండితులు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ, ఒకేవిధమైన శబ్దప్రక్రియను అనుసరిస్తారు. పలకవలసిన విధంగా పదాలను ఉచ్చరించడం, రకాత్‌లను పారాయణ చేసే తీరును బట్టి శబ్దానికి ఇంపైన అలంకారం చేకూరుతుంది. ఇలా నియమబద్ధంగా, లయబద్ధంగా పారాయణ చేయడాన్ని ధార్మిక పరిభాషలో ‘తజ్వీద్’అంటారు. పారాయణాన్ని ‘ఖిర త్’ అని, పారాయణ చేసేవారిని ‘ఖారీ’ అంటారు. ఇస్లామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏ భాష మాట్లాడేవారైనా ఇదే నియమాన్ని పాటిస్తారు. ఇదేవిధంగా అరబ్బీ భాషలోని అల్లాహ్ అనే పదం. దీనికి మరో నిర్వచనం గానీ, సరిపోలిన మరో పదంగానీ లేదు. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే పదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘అల్లాహ్’ అన్న పదాన్ని సాధారణంగా దేవుడు, దైవం అంటాం. ఆంగ్లంలో గాడ్ అంటాం. ఇస్లామీయుల ప్రకారం సర్వసృష్టికర్తను ఒక్కోభాషలో ఒక్కోపేరుతో పిలుస్తూ ఉండవచ్చు. కానీ అన్ని భాషాపదాల్లో ‘అల్లాహ్’ అన్నది అత్యంత విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు ఇది మాత్రమే అన్నివిధాలా శోభించే పదం. ఎందుకంటే, దేవుడు అన్న పదానికి బహువచనం దేవుళ్లు అవుతుంది. స్త్రీలింగం అయితే దేవత అయిపోతుంది. కనుక అల్లాహ్ అన్న పదం విశ్వవ్యాప్తమైనది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయులు సృష్టికర్తను సూచించే, పలికే ఏకైకపదం అల్లాహ్! ఇస్లామ్ మతాన్ని అనుసరించేవారు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏ భాష మాట్లాడేవారైనా సరే తమ ప్రభువును అల్లాహ్ అని మాత్రమే పిలుస్తారు. అలాగే ‘అజాన్’, ‘నమాజ్’లు కూడా! ప్రతిరోజూ ఐదు పూటలు పలికే అజాన్‌లో, ఆచరించే నమాజ్‌లో ఎక్కడా ఒక్క అక్షరం కాదుకదా, ఒక కొమ్ము, ఒక ఒత్తు, కనీసం కామా, ఫుల్స్టాప్లలో కూడా తేడా ఉండ దు. ఒకేవిధమైన శబ్ద, భాష, భావతరంగం విశ్వవ్యాప్తంగా ఒకే తీరుగా, ఒకే లయలో అనుక్షణం ప్రతిధ్వనిస్తూ పుడమిపైన, ప్రకృతిలోని ప్రాణికోటిని పులకింపజేస్తూ ఉంటుంది. ఈ శిష్ట, విశిష్టపదబంధాల్లోని సుమధుర సంగీతఝరి విశ్వవ్యాప్తంగా హృదయాలను రంజింపజేస్తూ సృష్టికర్తకు చేరువ చేస్తూ ఉంటుంది. ఈ విశ్వజనీన ఆధ్యాత్మిక సంగీత మకరందాన్ని ఆస్వాదించి, ఆఘ్రాణించినవారు నిజంగానే ధన్యులు. - యండి. ఉస్మాన్‌ఖాన్