కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఆశ్రఫ్ ఘనీ రాజీనామా? చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కామాండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అబ్దుల్ ఘనీ.. ఆఫ్ఘాన్ ముజాహిద్ కమాండర్ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో ఓ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2010లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్ చేశారు. 2018 అక్టోబర్ 24 వరకు పాక్ జైలులో గడిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు.
విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టం: తాలిబన్లు
విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్‌లో ఉన్న విదేశీయులు రిజిస్టర్ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని తిరిగి రావాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment