Abdul Ghani
-
నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు
కాబూల్: తాలిబన్ల మధ్య అంతర్గతంగా జరిగిన ఘర్షణలో తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధానమంత్రి అబ్దుల్ ఘనీ బరాదర్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ల అధికారిక వెబ్సైట్లలో ఈ ఆడియోను పోస్టు చేశారు. తనకు ఏమీ కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం దారుణమని విమర్శించారు. పుకార్లు సృష్టించడం మానుకోవా లని హితవు పలికారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అధికారాన్ని పంచుకొనే విషయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన లో బరాదర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. -
ఆఫ్ఘనిస్థాన్ నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘనీ!
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఆశ్రఫ్ ఘనీ రాజీనామా? చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కామాండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అబ్దుల్ ఘనీ.. ఆఫ్ఘాన్ ముజాహిద్ కమాండర్ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో ఓ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2010లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్ చేశారు. 2018 అక్టోబర్ 24 వరకు పాక్ జైలులో గడిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు. విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టం: తాలిబన్లు విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్లో ఉన్న విదేశీయులు రిజిస్టర్ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని తిరిగి రావాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. -
అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్
-
వైఎస్సార్సీపీలోకి ‘పురం’ మాజీ ఎమ్మెల్యే ఘని
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం ఆయన టీడీపీకి రాజీనామా చేసి, ఆ ప్రతిని చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఘనీకి జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉంటే ‘అనంత’ తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గంలో ఘని కీలక నేత. 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో నందమూరి బాలకృష్ణ ‘పురం’ నుంచి పోటీ చేయడంతో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టిక్కెట్ నిరాకరించింది. మైనార్టీలకు టీడీపీలో సరైన గుర్తింపు దక్కకపోవడం, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. ఈయన రాజీనామాతో హిందూపురం లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో బాలకృష్ణ విజయం కోసం ఘని తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతోమైనార్టీ నేతలంతా దాదాపు టీడీపీకి దూరమైనట్లే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడి సామాన్య కార్యకర్తలా వైఎస్సార్సీపీలో చేరాను. పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. మైనార్టీలకు టీడీపీలో ఏ మాత్రం గౌరవం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్ను పక్కనపెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా మైనార్టీలకు స్థానం కల్పించలేదు. మైనార్టీలకు గతంలో న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. భవిష్యత్తులో కూడా జగన్మోహన్రెడ్డితోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లకు ఆయన కట్టుబడి ఉన్నారు. హిందూపురం పార్లమెంట్లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి, నియోజకవర్గంపై ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ‘పురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన మైనార్టీ సోదరులు, పురం నియోజకవర్గ ప్రజలు ఇక మీదట కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నా. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, శ్రీకాకుళం: అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అబ్దుల్ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్ గని పేర్కొన్నారు. టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం హిందుపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత వైఎస్సార్సీపీలో చేరడం.. ఆ పార్టీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ సీనియర్ నేత అయిన అబ్దుల్ గని 2009 నుంచి 2014 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ కోసం ఆయన హిందూపురం సీటును వదులుకున్నారు. అబ్దుల్ గని చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనను పట్టించుకోకుండా అవమానాలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ప్రజానేత వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రజాభిమానానికి తాను సైతం మద్దతు పలుకుతూ.. అబ్దుల్ గని తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. -
అబ్దుల్ ఘని, రంగనాయకులు హౌస్ అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులును పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు. హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. దాంతో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించిన రంగనాయకులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.