
లండన్ : ఎనిమిది మంది శిశువుల హత్య, మరికొంతమంది పసిబిడ్డలపై హత్యాయత్నం కేసుకు సంబంధించి నర్సుపై తాజాగా ఛార్జ్‌షీట్ నమోదు చేశారు చెషైర్ పోలీసులు. ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌కు చెందిన లూసీ లెట్బీఅనే 30 ఏళ్ల మహిళ స్థానిక చెస్టర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ 2015-16 మధ్య కాలంలో ఎనిమిది మంది శిశువులను హత్య చేసింది. దాదాపు 10 మంది చిన్నారులపై హత్యాయత్నానికి పాల్పడింది. (తమిళనాడులో ట్రిపుల్ మర్డర్స్ సంచలనం)
దీంతో 2019లో చెషైర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఛార్జ్‌షీట్ నమోదు చేయకుండానే బెయిల్‌పై విడుదల చేశారు. అయితే ఈ మంగళవారం నాడు లూసీ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు. గురువారం మొదటిసారిగా వారింగ్టన్ మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment