
బీజింగ్: భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణచల్ ప్రదేశ్‌లోని సుమారు 15 ప్రాంతాలకు చైనా భాషలో పేర్లు మార్చడాన్ని డ్రాగన్ దేశం సమర్థించుకుంది. ఆ ప్రాంతాలు దక్షిణ టిబెట్‌లో ఉన్న తమ అంతర్గత భాగంలోనివని చైనా వక్రబుద్ధిని ప్రదర్శించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్పుచేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ దేశంలో అంతర్భాగమని భారత్ స్పష్టం చేసింది. చైనా కుయుక్తులతో ఆ ప్రాంతాల పేర్లు మార్చితే సత్యం మారిపోదని తేల్చి చెప్పింది.
ఇక అరుణాచల్ ప్రదేశ్ పలు స్థలాల పేరు మార్చటానికి చైనా ప్రయత్నించడం ఇది తొలిసారి కాదని, 2017 ఏప్రిల్‌లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే భారత్ స్పందనపై.. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలు దక్షిణ టిబెట్ చెందినవని, అవి చైనా అంతర్గత భూభాగాలని సమర్థించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment