వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడ్‌న్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్‌పై రిపబ్లికన్ పార్టీ అధ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కంటే కమలా హారీస్‌ను ఓడించడం చాలా తేలిక అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కమలా హారీస్‌పై సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అధ్యక్ష పదవికి బైడెన్ అన్‌ఫిట్. ప్రజాసేవకు బైడెన్ పనికిరాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బైడెన్ హయాంలో మాతో పాటు అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చాక బైడెన్ చేసిన డ్యామేజ్‌ని పూర్తి స్థాయిలో నివారిస్తామని చెప్పారు.
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది 59 ఏళ్ల హారిస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యలంలో కమలా హారీస్ పోటీలో నిలిచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment